మహేష్ బాబుతో రాజమౌళి ఆ తరహా చిత్రం చేయాలనుకుంటున్నాడా..

మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఒక వేళ అన్ని కుదిరి వుంటే.. బాహుబలి కంటే ముందు మహేష్ బాబుతో జక్కన్న సినిమా చేయాల్సింది. ఐతే మహేష్ బాబు కోసం రాజమౌళి ఇప్పటికే అదిరిపోయే స్టోరీలను రెడీ చేసి పెట్టినట్టు సమాచారం.

news18-telugu
Updated: July 7, 2020, 9:28 PM IST
మహేష్ బాబుతో రాజమౌళి ఆ తరహా చిత్రం చేయాలనుకుంటున్నాడా..
మహేష్, రాజమౌళి Photo : Twitter
  • Share this:
మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఒక వేళ అన్ని కుదిరి వుంటే.. బాహుబలి కంటే ముందు మహేష్ బాబుతో జక్కన్న సినిమా చేయాల్సింది. కానీ రాజమౌళి .. బాహుబలి తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్ ఇచ్చినా.. కానీ ఎన్టీఆర్, చరణ్ మాత్రం కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత కానీ షూటింగ్స్‌లో పాల్గొనబోమని ఖరాఖండిగా చెప్పారు. ఈ సందర్భంగా రాజమౌళి.. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో మహేష్ బాబు కోసం అద్భుతమైన స్టోరీ రెడీ చేయిస్తున్నట్టు సమాచారం. సీనియర్ నిర్మాత కే.యల్. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఇక రాజమౌళి కూడా బాహుబలి నుంచి తన సినిమాలను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు.

రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)
రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)


ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం అదిరిపోయే స్టోరీ లైన్ రెడీ చేసినట్టు సమాచారం. మహేష్ బాబుతో చేయబోయే సినిమాను జేమ్స్ బాండ్ లేకపోతే.. కౌబాయ్ తరహా యాక్షన్ మూవీ అని రాజమౌళి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక మహేష్ బాబు కూడా జక్కన్నతో సినిమా అంటే స్టోరీ వినకుండా ఓకే చేసాడు. అందుకే రాజమౌళి తనతో ఎలాంటి సబ్జెక్ట్‌తో సినిమా చేయాలనేది ఆయన డిసిషన్ మీద ఆధారపడి ఉంది.

రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)
రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)


ఇక రాజమౌళి కూడా తాను ఏ సినిమా తెరకెక్కించినా.. ముందుగానే ఆ సినిమా స్టోరీ ఏంటనేది ముందుగానే చెప్పేస్తుంటాడు. ఒక విధంగా కథ చెప్పి తన సినిమాలపై హైప్ క్రియేట్ చేయడం రాజమౌళికి ముందు నుంచే ఓ అలవాటు ఉంది. మొత్తంగా రాజమౌళి.. మహేష్ బాబు కాంబినేషన్‌లో ఏ తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తాడనేది ఇప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు మొదలైయ్యాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 7, 2020, 9:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading