హోమ్ /వార్తలు /సినిమా /

Thugs | Rajamouli : థగ్స్ టీజర్‌కు రాజమౌళి ప్రశంసలు.. వీడియో వైరల్..

Thugs | Rajamouli : థగ్స్ టీజర్‌కు రాజమౌళి ప్రశంసలు.. వీడియో వైరల్..

Director Rajamouli praises team Thugs Photo : Twitter

Director Rajamouli praises team Thugs Photo : Twitter

Thugs : ప్రముఖ డాన్స్ మాస్టర్ బృంద గోపాల్ దర్శకత్వంలో, పులి, ఇంకొకడు, సామి 2, పలు హిందీ చిత్రాలు నిర్మించిన పాపులర్ ప్రొడ్యూసర్ 130 కి పైగా చిత్రాలు పంపిణీ చేసిన టాప్ డిస్ట్రిబ్యూటర్ షిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్న సినిమా థగ్స్ (Thugs).

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ప్రముఖ డాన్స్ మాస్టర్ బృంద గోపాల్ దర్శకత్వంలో, పులి, ఇంకొకడు, సామి 2, పలు హిందీ చిత్రాలు నిర్మించిన పాపులర్ ప్రొడ్యూసర్ 130 కి పైగా చిత్రాలు పంపిణీ చేసిన టాప్ డిస్ట్రిబ్యూటర్ షిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్న సినిమా థగ్స్ (Thugs). ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా షిబు కుమారుడు హృదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ (Bobby Simha), ఆర్ కె సురేష్, మునిష్కాంత్, అనస్వర రాజన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శామ్ సి ఎస్ (Sam CS) సంగీతాన్ని అందిస్తుండగా, ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ అంతోనీ ఎడిటర్ గా, జోసెఫ్, నెల్లికల్ ప్రొడక్షన్ డిజైనర్ గా థగ్స్ రూపొందుతోంది.

  ఈ చిత్రానికి సంబంధించి క్యారక్టర్ ఇంట్రడక్షన్ వీడియో ను చెన్నై లో ఆర్య, భగ్యరాజ్, గౌతమ్ మీనన్, పార్థిబన్, ఖుష్బూ , దేసింగ్, పూర్ణిమ భాగ్యరాజ్, కళా మాస్టర్ వంటి ప్రముఖుల సమక్షంలో భారీ వేడుకలో విడుదల చేశారు. అందరూ థగ్స్ భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. క్యారక్టర్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ థగ్స్ గా విడుదల అయిన ఈ వీడియో లో సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు.

  'మాస్టర్ మైండ్' సేతు గా హృదు, 'రోగ్' దురై గా సింహ, 'బ్రూట్' ఆరాకియా దాస్ గా ఆర్ కె సురేష్, 'క్రుకెడ్' మరుదు గా మునిష్కాంత్ కనిపించిన ఈ వీడియో సినిమా మీద అంచనాలను పెంచే విధంగా ఉంది. వీడియో ఆద్యంతం శామ్ సి ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూడ్ ని ఎలివేట్ చేసేలా సాగింది.

  ఇక థగ్స్ టీజర్‌ను చూసిన దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) వీడియో బైట్ లో హీరో హృదు కి, దర్శకురాలు బృంద కి తన బెస్ట్ విషెస్ చెప్పారు. అంతేకాదు థగ్స్ చిత్రం విడుదలయ్యే అన్ని భాషల్లో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నవంబర్ లో థియోటర్స్ లో తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: SS Rajamouli, Tollywood news

  ఉత్తమ కథలు