ఆర్ఆర్ఆర్ సినిమాకు రాజమౌళి బిగ్ షాక్.. జక్కన్న ట్వీట్‌తో కలకలం..

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి రాజమౌళి బిగ్‌ షాక్ ఇవ్వనున్నారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: December 19, 2019, 7:37 AM IST
ఆర్ఆర్ఆర్ సినిమాకు రాజమౌళి బిగ్ షాక్.. జక్కన్న ట్వీట్‌తో కలకలం..
దర్శకుడు రాజమౌళి (rajamouli)
  • Share this:
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి రాజమౌళి బిగ్‌ షాక్ ఇవ్వనున్నారు. ఐతే.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు ఈ నెల 25న బ్రేక్ ఇస్తా అని ప్రకటించాడు. ఈ నెల 25నరాజమౌళి అన్న  కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా నటించిన ‘మత్తు వదలరా’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు కీరవాణి మరో కొడుకు కాల బైరవ స్వరాలు సమకూర్చాడు.ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్  ఈ చిత్రాన్ని నిర్మించారు. రితేష్ రానా డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా పూర్తి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఈ బుధవారం రానా చేతులు మీదుగా ఈ  చిత్ర ట్రైలర్ విడుదలైంది. అంతేకాదు ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ మూవీ ఈ నెల 25న విడుదల కానున్న నేపథ్యంలో రాజమౌళి ఆ సినిమాను ఉద్దేశిస్తూ మా ఇద్దరు కుర్రాళ్లు శ్రీ సింహ, కాలభైరవ ఈ మూవీతో తెరంగేట్రం చేస్తున్నారు. నాకెంతో ఎగ్జైంట్మెంట్‌గా ఉందన్నారు.మూవీ విడుదల రోజున ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ డుమ్మా కొడుతున్నట్టు ట్వీట్ చేసాడు. కాబట్టి డిసెంబర్ 25న రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్,ప్రభాస్, రానాలతో ఈ సినిమా చూడనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ వైజాగ్‌లోని ఏజెన్సీ ఏరియాలో జరుగుతోంది. అక్కడ ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో తెరకెక్కించే పనిలో ఉన్నాడు రాజమౌళి.

Published by: Kiran Kumar Thanjavur
First published: December 19, 2019, 7:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading