DIRECTOR PURI JAGANNADH THANKS YS JAGAN FOR GIVING MLA SEAT TO HIS BROTHER CR
జగన్‌కు రుణపడి ఉంటానన్న పూరీ జగన్... ఆయన సింహంలా కనిపిస్తున్నాడంటూ పోస్ట్...
జగన్‌కు రుణపడి ఉంటానన్న పూరీ జగన్... ఆయన సింహంలా కనిపిస్తున్నాడంటూ పోస్ట్...
జగన్ ఓ యోధుడు.... నా ఉద్దేశంలో దైవ నిర్ణయం కంటే ప్రజా నిర్ణయమే గొప్పది...నాకు జగన్ సింహంలా కనిపిస్తున్నారు... ట్విట్టర్లో లేఖ పోస్ట్ చేసి అభిమానాన్ని చాటుకున్న పూరీ జగన్నాథ్...
ఇండస్ట్రీలో క్రియేటివిటీ మెండుగా ఉన్న దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకడు. ‘పోకిరీ’ సినిమాతో ప్రిన్స్ మహేష్ బాబును సూపర్‌స్టార్‌గా మార్చిన పూరీ జగన్... కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన ‘టెంపర్’ సినిమా బాక్సీఫీస్ దగ్గర మంచి విజయం సాధించినా... ఆ క్రెడిట్లో చాలాభాగం కథా రచయిత వక్కంతం వంశీకే వెళ్లింది. దాంతో సొంత కథతో సాలీడ్ హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో పడ్డాడు పూరీ జగన్. ప్రస్తుతం రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కిస్తూ యమా బిజీగా ఉన్న పూరీ జగన్నాథ్... ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. రాజకీయాల్లో లేకపోయినా జగన్ ఓ యోధుడిలా, ఓ సింహంలా కనిపిస్తున్నాడంటూ ఆంధ్రా కొత్త ముఖ్యమంత్రిని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. దీనికి కారణమేంటంటే... పూరీ జగన్ తమ్ముడు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడమే. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం నుంచి వైసీపీ తరుపున బరిలో నిలిచిన పూరీ జగన్నాథ్ తమ్ముడు ఉమాశంకర్ గణేశ్... అద్భుత విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై 22,300 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించాడు ఉమాశంకర్ గణేశ్. దీంతో తమ్ముడి విజయానికి కారణమైన వైఎస్ జగన్‌కు థ్యాంక్స్ చెబుతూ ట్విట్టర్లో ఓ లేఖను పోస్ట్ చేశారు పూరీ జగన్నాథ్.
ఈ రెండు సినిమాల తర్వాత పూరీ జగన్నాథ్, మెగాస్టార్ చిరంజీవితో ఆటో జాని సినిమా తీస్తారనే టాక్ వినిపిస్తోంది.
‘ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు నేను వైజాగ్‌లో ఉన్నాను. మా కుటుంబసభ్యులతో కలిసి టీవీ చూస్తున్నా. మా తమ్ముడు ఉమాశంకర్ గణేశ్ నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. అటు పక్క ఉన్నది రాష్ట్రమంతి అయ్యన్నపాత్రుడు కాబట్టి వాడు గెలవడం చాలా కష్టం అనుకున్నాం. కానీ వార్ వన్‌సైడ్ అయిపోయేసరికి మతిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా రహస్యంగా మీటింగ్ పెట్టుకుని జగన్‌కే ఓటేద్దామనుకున్నారేమో... ఇన్ని కోట్ల మంది ఒకేసారి ఒక మనిషిని నమ్మడం, అతను వాళ్ల నాయకుడు కావాలని కోరుకోవడం చిన్నవిషయం కాదు... జగన్‌కు హ్యాట్సాఫ్! ఎందుకంటే ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ ఒంటరివాడైపోయాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలను తట్టుకుంటూ శక్తిని కూడగట్టుకుని ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించారు.
మోదీని కలిసిన జగన్
విజయం సాధించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడిన వీడియో చూశాను. ఆయన ముఖంలో విజయ గర్వం లేదు. పొగరు లేదు. మౌనంగా ఉన్నారు. సేద తీరుతున్నట్టు కనిపించారు. రాజన్న కొడుకు అనిపించుకున్నారు. జగన్ యోధుడు. దేవుడి నిర్ణయం, ప్రజా తీర్పు వల్ల ఈ విజయం దక్కిందని జగన్ అన్నారు. నా ఉద్దేశంలో దైవ నిర్ణయం కంటే ప్రజా నిర్ణయమే గొప్పది...
రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ డేట్
నా తమ్ముడికి జగన్ అంటే ప్రాణం. ఆయన ఫోటో చూసినా, వీడియో కనిపించినా తెగ ఎగ్జైట్ అయిపోతాడు. వాడు ఎందుకలా ఫీలవుతాడో నాకు ఇవాళ అర్థమైంది. గత ఎన్నికల్లో నా తమ్ముడు ఓడిపోయినా, మళ్లీ భుజం తట్టి చెయ్యి పట్టుకుని యుద్ధంలోకి లాక్కెళ్లి ఇంతటి విజయాన్ని అందించిన జగన్‌కు నేను, నా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటాం. నేను రాజకీయాల్లో లేను కానీ నాకు యోధులంటూ ఇష్టం. నాకు జగన్ సింహంలా కనిపిస్తున్నారు...’’ అంటూ తన లేఖలో పేర్కొన్నాడు పూరీ జగన్నాథ్. ప్రస్తుతం తన కొడుకు ఆకాశ్ పూరీతో ‘రొమాంటిక్’ అనే సినిమాతో పాటు రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు పూరీ జగన్. ఈ సినిమా జూన్ 12న విడుదల కాబోతోంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.