DIRECTOR PURI JAGANNADH SORRY TO DIRECTOR K RAGHAVENDRA RAO IN THE EVENT OF ANUSHKA 15 YEARS TA
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు సారీ చెప్పిన ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ..
దర్శకేంద్రుడికి ఇస్మార్ట్ డైరెక్టర్ క్షమాపణలు (Twitter/Photo)
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావుకు ఇస్మార్ట్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అందరి ముందు క్షమాపణలు చెప్పాడు. ఈ డాషింగ్ డైరెక్టర్..దర్శకేంద్రుడికి ఎందుకు క్షమాపణలు చెప్పాడంటే..
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావుకు ఇస్మార్ట్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అందరి ముందు క్షమాపణలు చెప్పాడు. ఈ డాషింగ్ డైరెక్టర్..దర్శకేంద్రుడికి ఎందుకు క్షమాపణలు చెప్పాడంటే.. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘సూపర్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టింది అనుష్క. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ఒకవైపు గ్లామర్ పాత్రలు.. మరోవైపు మహిళా ప్రాధాన్యత కూడిన చిత్రాలతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆమెకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతేకాదు హీరోయిన్గా నిన్నటితో కెమెరాకు ముందుకు వచ్చిన 15 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘నిశ్శబ్ధం’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘15 ఇయర్స్ ఆఫ్ అనుష్కశెట్టి’ పేరుతో హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి అనుష్కశెట్టితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
కే.రాఘవేంద్రరావు,పూరీ జగన్నాథ్ (Twitter/Photo)
ఈ కార్యక్రమంలో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. అనుష్క నటించిన ‘నమో వెంకటేశాయ’ సినిమాతో పాటు ఆ చిత్ర దర్శకుడు కే.రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు నా ఫస్ట్ మూవీ ‘బద్రి’ సినిమాకు ముఖ్యఅతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి నన్ను ఆశీర్వదించారు. అపుడు
ఆయన నీ పేరేంటి అని అడిగారు ? సర్ నా పేరు జగన్ అని చెప్పాను. ఈ గడ్డం ఉంటే తమిళోడివి అనుకున్నాను అని ఆయన అన్నారు. అపుడే నేను కలుగజేసుకొని..సర్ మీకు కూడా గడ్డం ఉంది . మేము మీరు తమిళ వాళ్లని అనుకోవడం లేదు కదా సర్ అని సమాధానమిచ్చాను. వెంటనే ఆయన నీకు వెటకారం ఎక్కువైంది అని నన్ను సరదాగా తిట్టారు. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ‘సూపర్’ సినిమా షూటింగ్ టైమ్లో కలిసారు. ఆయన్ని చూసిన వెంటనే ఎందుకు వచ్చారు సర్ అని అడిగాను. ఆయన నాగార్జునతో సినిమా తీయబోతున్నాను ఆయన డేట్స్ కోసం వచ్చానన్నారు.
కే.రాఘవేంద్రరావు,పూరీ జగన్నాథ్ (Twitter/Photo)
అపుడే నేను ‘సర్ నేను ఐదో తరగతిలో ఉన్నపుడు మీ డైరెక్షన్లో వచ్చిన ‘అడవిరాముడు’ సినిమా చూశా. ఇపుడు నేను డైరెక్టర్ అయి సినిమా చేస్తున్న ఈ టైమ్లో నాగార్జున డేట్స్ ఎందుకు సర్ అన్నాను. మీరు వెంటనే సినిమాలకు పులిస్టాప్ పెట్టి రిటైర్ అయిపోయిపోతే బాగుండు అన్నాను. నా మాటలకు ఆయన చిరునవ్వు నవ్వి ఆయన డేట్స్ తీసుకెళ్లిపోయారు. ఆ సమయంలో నాగార్జున మా ఇద్దరితో సినిమాలు చేస్తున్నారు. అపుడు నేను ‘సూపర్’ సినిమాతో నాగార్జునకు ఫ్లాప్ ఇస్తే.. కే.రాఘవేంద్రరావు మాత్రం ఆయనకు ‘శ్రీరామదాసు’ వంటి సక్సెస్ఫుల్ మూవీ ఇచ్చారు. ఆ సమయంలో రాఘవేంద్రరావుగారితో మాట్లాడిన అనవసరపు మాటలకు ఇపుడు ఈ వేదిక మీదుగా క్షమాపణలు చెబుతున్నాను అని పూరీ అంటే.. వెంటనే పక్కనే ఉన్న రాఘవేంద్రరావు అతన్ని వెంటకే హత్తుకున్నాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.