Puri Jagannadh: సోషల్ మీడియాపై పూరీ జగన్నాథ్ మరో సెన్సేషనల్ వీడియో..

పూరి జగన్నాధ్ Photo : Twitter

Puri Jagannadh: టాలీవుడ్‌లో తనదైన డిఫరెంట్ స్టైలింగ్ సినిమాలతో ఇస్మార్ట్  దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పూరీ జగన్నాథ్. తాజాగా పూరీ జగన్నాథ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.

 • Share this:
  Puri Jagannadh: టాలీవుడ్‌లో తనదైన డిఫరెంట్ స్టైలింగ్ సినిమాలతో ఇస్మార్ట్  దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పూరీ జగన్నాథ్.  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న మోస్ట్ డేరింగ్ దర్శకుల్లో ఈయన కూడా ఒకడు. వందల కోట్ల ఆస్తులు పోయినా మళ్లీ సంపాదించుకున్నాడు.. డ్రగ్స్ కేసు నెత్తిమీద పడినా లేచి నిలబడ్డాడు. ఏదైనా విషయం గురించి సూటిగా సుత్తి లేకుండా మాట్లాడాలంటే కూడా పూరీని మించిన దర్శకుడు లేడు. ఇప్పుడు షూటింగ్స్ కూడా లేకపోవడంతో తన యూ ట్యూబ్ ఛానెల్‌పై ఫోకస్ చేసాడు పూరీ. తాజాగా ఈ యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలు అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే సెక్స్ ‌తో పాటు పలు అంశాలపై తన వాయిస్‌ను వినిపించాడు పూరీ జగన్నాథ్. ఈయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి కూడా. అయినా ఎక్కడా వెరవకుండా తనదైన శైలిలో  పూరీ మ్యూజింగ్స్‌లో తనదైన వీడియోలతో దూసుకుపోతున్నాడు ఈ డేరింగ్ డైరెక్టర్. తాజాగా పూరీ జగన్నాథ్.. సోషల్ మీడియా అనే టాపిక్ పై మాట్లాడారు.
  View this post on Instagram

  ‪👉 https://youtu.be/dhZ8cqU2_wU @charmmekaur #PC


  A post shared by Puri Connects (@puriconnects) on

  సోమచ్ ఫ్రస్టేషన్ ఇన్ ది వరల్డ్. ప్రతి దానికి కోప్పడుతూ.. అందరినీ ఇష్టమొచ్చినట్టు తిడుతూ.. నెగిటివ్ కామెంట్స్‌తో డే అంతా గడిపితే.. నష్టపోయేది ఎవరో తెలుసుకోవాలంటూ ఇన్‌డైరెక్ట్‌గా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌కు బానిసలైన వాళ్ల  గురించి చెప్పాడు. ప్రస్తుతం సోషల్ మీడియాల ప్రతి ఒక్కరికీ బ్రెడ్ బటర్‌లా తయారైందన్నారు. ఎవరికైనా.. నా కైనా మన గురించి నెగిటివ్‌గా ఏదైనా కనిపిస్తే చిరాకు.  ఇపుడు అందులో తిట్టి పోసుకోవడం ఎక్కువైందన్నారు. రాజుగారి పెద్ద భార్య చాలా మంచిది అని ట్విట్ చేస్తే.. మరి చిన్న భార్య మంచిది కాదా అని పడిపోయే బ్యాచ్ ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు పూరీ. సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ పెరిగిందన్నారు. మహానుభావుల యూట్యూబ్ వీడియోస్‌కు కూడా లైకులకన్నా.. డిస్ లైకులు ఎక్కువున్నాయన్నాడు.

  పూరీ జగన్నాథ్ (puri jagannadh)
  పూరీ జగన్నాథ్ (puri jagannadh)


  సోషల్ మీడియా వల్ల ఉపయోగాల కంటే దరిద్రాలే ఎక్కువయ్యాయన్నారు. సోషల్ మీడియా అనేది ఓ పెంటకుప్పలా తయారైంది. ఈ దరిద్రాన్ని నివారించాలంటే.. అందరి సోషల్ మీడియా అకౌంట్‌లకు ఆధార్‌ను లింక్ చేయాలన్నాడు. అలా మన ప్రభుత్వంతో పాటు వివిధ దేశాలు కూడా ఆయా దేశాల్లో చట్టాలు చేయాలన్నారు. ప్రపంచంలో ఆడవాళ్లు 350 కోట్ల మంది వుంటే.. ఆడవాళ్ల ఫేస్‌బుక్ అకౌంట్లు 1000 కోట్లకు పైగానే ఉన్నాయి. మొత్తంగా ప్రపంచ జనాభానే 750 కోట్ల వరకు ఉంది.  మరి ఫేక్ అకౌంట్లు ఎక్కడనుంచి వచ్చాయో అందరికీ తెలిసిన విషయమే. ఇలా రోజంతా నెగిటివ్ కామెంట్స్‌తో సంకనాకి పోయేది ఎవరో కాదు మనమే. ఒకతను రోడ్డు మీద పోతూ ఏదో  కనిపిస్తే ఆగాడు. అర్ధం కాలేదు. వంగి వాసన కూడా చూసిన అతనికి అది  ఏమిటో తెలియలేదు.  ఆ తర్వాత నాలుకతో రుచి చూసాడు. అపుడు కానీ అర్ధం కాలేదు. అది పేడ అని. అమ్మో పేడా.. ఇంకా నయం నేను తొక్కలేదు అనుకున్నడట. ఇది జోక్ కాదు. ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా చేస్తోన్న పని ఇదే అన్నాడు. నా పేడ నువ్వు.. నీ పేడ నేను.. అంటూ సోషల్ మీడియాపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టాడు పూరీ.

  Published by:Kiran Kumar Thanjavur
  First published: