ఎన్టీఆర్ కారు నడిపితే ఎట్టా ఉంటాదో తెలుసా...

ప్రస్తుతం ఇస్మార్ట్ శంక‌ర్ మూవీ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న పూరి...అంతకు ముందు ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన టెంపర్ సినిమా గురించి ప్రస్తావించాడు.

news18-telugu
Updated: July 23, 2019, 12:38 PM IST
ఎన్టీఆర్ కారు నడిపితే ఎట్టా ఉంటాదో తెలుసా...
అక్కడితో ఆగకుండా జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా కూడా ప్రస్తుతం టీడీపీని కాపాడలేని పరిస్థితికి వచ్చేసిందని తెలిపాడు నాని. ఏపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
  • Share this:
డ్రైవింగ్ అంటే ఎవరికైనా ఇష్టమే. ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తూ...ఆ థ్రిల్‌ను సొంతం చేసుకోవాలనే ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. ఇక తమదైన లగ్జరీ కార్లతో ఇలాంటి ఫీల్‌ను ఎంజాయ్ చేయడానికి మన సినీ సెలబ్రిటీలు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. సినిమాల్లోనే కాదు... అవకాశం దొరికితే రియల్ లైఫ్‌లోనూ కారెక్కి రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంటారు. టాలీవుడ్ క్రేజీ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా దాదాపు ఇదే రేంజ్ స్పీడ్‌తో డ్రైవింగ్ చేస్తాడనే విషయాన్ని స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ రివీల్ చేశాడు. తారక్ స్పీడ్ అంటే తనకు ఎంత భయమో చెప్పాడు. ప్రస్తుతం ఇస్మార్ట్ శంక‌ర్ మూవీ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న పూరి...ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన టెంపర్ సినిమా గురించి ప్రస్తావించాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ డ్రైవింగ్ ఏ విధంగా ఉంటుందో వివరించాడు.

టెంపర్ సినిమాను ఎక్కువగా గోవాలో షూట్ చేశామని చెప్పిన పూరి జగన్నాధ్... ఆ సమయంలో కారులో తారక్‌తో కలిసి ఎక్కువగా జర్నీ చేశానని చెప్పుకొచ్చాడు. ఆ ఎక్స్‌పీరియెన్స్‌ను తాను ఎప్పటికీ మర్చిపోలేనన్న పూరి జగన్నాధ్... అతడి కారులోనే రోజూ షూటింగ్‌కు వెళ్లేవాడినని వివరించాడు. తారక్ ఎంతో స్పీడ్‌గా కారు డ్రైవ్ చేస్తాడని... అతడు కారు తోలకుండా ఉండుంటే బావుంటుంది అనుకునేంత స్పీడుగా డ్రైవ్‌గా చేస్తాడని పూరి వ్యాఖ్యానించాడు. టెంపర్ తరువాత కొన్నేళ్ల పాటు సక్సెస్ సాధించలేకపోయిన పూరి జగన్నాధ్... మళ్లీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్నాడు.
Published by: Kishore Akkaladevi
First published: July 23, 2019, 12:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading