Home /News /movies /

DIRECTOR PURI JAGANNADH REVEAL HOW TO CHANGE HER NAME SWEETY SHETTY TO ANUSHKA TA

అనుష్క శెట్టి గుట్టు బట్ట బయలు చేసిన పూరీ జగన్నాథ్.. అందరి ముందే..

అనుష్క,పూరీ జగన్నాథ్(Twitter/Photo)

అనుష్క,పూరీ జగన్నాథ్(Twitter/Photo)

అనుష్క శెట్టి హీరోయిన్‌గా మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి 15 ఏళ్లు కంప్లీట్ అయ్యాయి. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్.. అందరి ముందే అనుష్క శెట్టి గుట్టు రట్టు చేసాడు.

    అనుష్క శెట్టి హీరోయిన్‌గా మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి 15 ఏళ్లు కంప్లీట్ అయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో 15 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు  పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి అనుష్కశెట్టితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అనుష్కశెట్టిని వెండితెరకు పరిచయం చేసిన పూరీ జగన్నాథ్.. అందరి ముందే ఆమె  గుట్టు రట్టు చేసాడు. నాగార్జున‌తో పూరీ జగన్నాథ్ ‘సూపర్’ సినిమా చేస్తోన్న సమయంలో అనుష్కను ఎక్కడ ఎలా కలిసింది. సూపర్ సినిమాకు ఎలా సెలెక్ట్ అయింది తదితర విషయాలను చెప్పేసాడు. అంతేకాదు స్వీటీ శెట్టి పేరును అనుష్కగా ఎలా మార్చారన్న విషయాన్ని వెల్లడించాడు. అందరు ఎంతో ముద్దగా పిలిచే స్వీటీనే అనుష్క శెట్టి అసలు పేరట. సూపర్ సినిమా చేసేటపుడు హీరో నాగార్జున మంచి స్క్రీన్ నేమ్ ఉంటే బాగుంటుందిన సలహా ఇచ్చాడట. దాంతో పూరీ జగన్నాథ్.. అపుడే ఈ సినిమాలో ఒక పాట పాట పాడటానికి వచ్చిన సింగర్ పేరు అనుష్క  కావడంతో ఆ పేరునే స్వీటీకి పెట్టాలని డిసైడ్ అయ్యాడట. అలా స్వీటీ శెట్టి కాస్తా అనుష్క శెట్టిగా మారింది. ఆ రకంగా స్వీటీకి అనుష్కగా నామకరణం చేసింది ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అనే విషయం స్పష్టం అయింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Anushka Shetty, K. Raghavendra Rao, Puri Jagannadh, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు