లాక్‌డౌన్‌లో అదిరిపోయే కథను రెడీ చేసిన పూరీ.. ఆ స్టార్ హీరోతో తెరకెక్కనున్న మూవీ..

తాజాగా పూరీ జగన్నాథ్.. విజయ దేవరకొండతో పైటర్ అనే ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో లాక్‌డౌన్‌లో పూరీ జగన్నాథ్ ఆ స్టార్ హీరో కోసం అదిరిపోయే కథను రెడీ చేసాడు.

news18-telugu
Updated: May 25, 2020, 9:10 AM IST
లాక్‌డౌన్‌లో అదిరిపోయే కథను రెడీ చేసిన పూరీ.. ఆ స్టార్ హీరోతో తెరకెక్కనున్న మూవీ..
పూరి జగన్నాథ్ (Puri Jagannadh)
  • Share this:
‘టెంపర్’ తర్వాత సరైన సక్సెస్‌లేని పూరీ జగన్నాథ్ గత యేడాది రామ్‌తో తీసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్.. విజయ్‌ దేవరకొండతో ‘ఫైటర్’అనే ప్యాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్.. మరోసారి బాలకృష్ణతో అదిరిపోయే లెవల్ స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం లాక్‌డౌన్ సందర్భంగా ఓ కథను రెడీ చేసి బాలయ్యకు ఫోన్‌లో వివరించినట్టు సమాచారం. దీనికి బాలకృష్ణ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమా సరిగా నడవకపోయినా.. ఈ సినిమాలో బాలయ్యను కొత్తగా చూపించి పూరీ జగన్నాథ్ మంచి మార్కులే కొట్టేశాడు. అందులో తేడా సింగ్‌గా చూపించినా బాలయ్య అభ్యంతరం వ్యక్తం చేయలేదు.  అంతేకాదు ఫ్లాపుల్లో ఉన్న తనకు పిలిచి మరి అవకాశమిచ్చిన బాలయ్య అంటే ఇపుడు పూరీ జగన్నాథ్‌కు ఎంతో ఇష్టం ఏర్పడింది. ఈ చిత్రం తర్వాత బాలయ్యతో పూరీకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.

బాలయ్య పూరీ జగన్నాథ్ (balakrishna puri jagannadh)
బాలయ్య పూరీ జగన్నాథ్ (balakrishna puri jagannadh)


. ఇక బాలకృష్ణ కూడా తనను కొత్తగా చూపించిన పూరీ టేకింగ్‌కు ఫిదా అయి అపుడే అతనితో రెండో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్.. మరోసారి బాలయ్యతో పవర్‌ఫుల్ కథను రెడీ చేసినట్ుట సమాచారం. పైసా వసూల్‌లో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా పర్ఫెక్ట్‌గా ఈ సినిమాను తెరెక్కించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాతో బాలయ్యకు ఆయన కెరీర్‌లోనే మెమరబుల్ హిట్ ఇస్తానని చెబుతున్నాడు పూరీ.

director puri jagannadh next movie with nandamuri balakrishna after paisa vasool movie,balakrishna,puri jagannadh,balakrishna nandamuri puri jagannadh,puri jagannadh,balayya,balayya trendes,balayya twitter,balakrishna facebook,puri jagannadh twitter,puri jagannadh instagram,puri jagannadh balakrishna paisa vasool,puri jagannadh ismart shankar,nandamuri balakrishna,puri jagannadh emotinoal words about balakrishna,puri jagannadh about balakrishna,balakrishna about puri jagannadh,director puri jagannadh emotinoal words about balakrishna,puri jagannadh about balayya,puri jagannadh interview,puri jagannadh emotinoal words about balayya,puri jagannadh to direct balakrishna,puri jagannadh about balakrishna look,telugu cinema,బాలకృష్ణ నందమూరి,పూరీ జగన్నాథ్,బాలయ్య పూరీ,పైసా వసూల్ పూరీ జగన్నాథ్ బాలకృష్ణ,తెలుగు సినిమా,ఇస్మార్ట్ శంకర్,బాలకృష్ణ పూరీ జగన్నాథ్,బాలయ్యతో పూరీ జగన్నాథ్
పూరీ దర్శకత్వంలో పైసా వసూలు సినిమా చేసిన బాలకృష్ణ (File/Photo)


మొత్తానికి అప్పట్లో ఎన్టీఆర్‌తో మొదటిసారి చేసిన ‘ఆంధ్రావాలా’తో సరైన సక్సెస్ ఇవ్వని పూరీ జగన్నాథ్.. ఆ తర్వాత ‘టెంపర్’ తో తారక్‌కు  మెమరబుల్ హిట్ అందించాడు పూరీ జగన్నాథ్. ఇపుడు అలానే బాలయ్యతో మొదటిసారి చేసిన ‘పైసా వసూల్’తో సక్సెస్ ఇవ్వని పూరీ జగన్నాథ్.. రెండో సినిమాతో హిట్టు ఇచ్చి బాలకృష్ణ రుణం తీర్చుకుంటాడా లేదా అనేది చూడాలి.మొత్తంగా లాక్‌డౌన్ పీరియడ్‌లో పూరీ జగన్నాథ్.. బాలకృష్ణకు మంచి స్క్రిప్టే రెడీ చేసినట్టు ఉన్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 25, 2020, 9:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading