సింహం అక్కడ లేకపోయినా సింహమే.. పూరీ జగన్నాథ్ సంచలన ట్వీట్..

Puri Jagannadh: పూరీ జగన్నాథ్ ఎప్పుడూ సినిమాలతోనే బిజీగా ఉంటాడు. ఆయన వివాదాల జోలికి వెళ్లడు కానీ అప్పుడప్పుడూ వచ్చి ఆయన చుట్టూ వివాదాలు చేరుతుంటాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 31, 2020, 8:30 PM IST
సింహం అక్కడ లేకపోయినా సింహమే.. పూరీ జగన్నాథ్ సంచలన ట్వీట్..
పైసా వసూల్ ఫ్లాప్ అయినా కూడా పూరీ అంటే బాలయ్యకు ఎనలేని యిష్టం. ఇందులో బాలయ్య యాక్టింగ్ అంటే ఆడియన్స్‌కు యిష్టం. అందుకే టీవీలో ఎప్పుడొచ్చినా రేటింగ్ కూడా బాగానే వస్తుంటుంది.
  • Share this:
పూరీ జగన్నాథ్ ఎప్పుడూ సినిమాలతోనే బిజీగా ఉంటాడు. ఆయన వివాదాల జోలికి వెళ్లడు కానీ అప్పుడప్పుడూ వచ్చి ఆయన చుట్టూ వివాదాలు చేరుతుంటాయి. ఇప్పుడు కూడా లాక్‌డౌన్ సమయంలో ఎంచక్కా ప్రస్తుతం చేస్తున్న ఫైటర్ సినిమాతో పాటు ఫ్యూచర్‌లో చేయబోయే సినిమాలకు కూడా కథలు రాసుకుంటూ బిజీగా ఉన్నాడు. అలాంటి పూరీ జగన్నాథ్ తాజాగా తన ట్విట్టర్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేసాడు. అందులో 'బీ ఏ లయన్' అనే కాన్సెప్ట్ ఉంది. ఆయన చేసిన పోస్టులో ఓ కథ కూడా ఉంది. అయితే ఇది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని ట్వీట్ చేశాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పూరి జగన్నాథ్ (Puri Jagannadh)
పూరి జగన్నాథ్ (Puri Jagannadh)


అందులో నిజం కూడా లేకపోలేదు. ఇంతకీ పూరీ జగన్నాథ్ ఏం ట్వీట్ చేసాడో తెలుసా..? అడవిలో బతకడం ఎలా అంటూ వీడియో స్టార్ట్ అయింది. ఈ అడవిలో 'అతి పెద్ద జంతువు' ఏది అంటే నేను 'ఏనుగు' అని చెప్పడం విన్నాను.. 'పొడవైన జంతువు' ఏదంటే నేను 'జిరాఫీ' అని చెప్పడం విన్నాను.. తెలివైన జంతువు ఏదంటే నేను 'నక్క' అని చెప్పడం విన్నాను.. వేగంగా పరిగెత్తే జంతువూ ఏదని అడిగితే నేను చిరుత అని చెప్పడం విన్నాను.. మరి ఇప్పటి వరకు చెప్పిన అన్ని అద్భుతమైన క్వాలిటీస్‌లో 'లయన్' లేదు కదా అంటే.. లేకపోతేనేం సింహాన్ని కింగ్ ఆఫ్ ది జంగిల్ అంటారు.. అది 'అడవికి రాజు'.

ఎందుకంటే 'సింహం' సాహసి.. బోల్డ్.. నమ్మకంగా నడుస్తుంది.. సింహం ప్రతీదాన్ని దాన్ని సాహసంగా ఎదుర్కొంటుంది.. ఎవరికీ భయపడడు.. నన్నెవరూ ఆపలేరని ముందడుగు వేస్తుంది.. సింహం తనకు వచ్చిన అవకాశాన్ని ఎప్పటికీ చేజార్చుకోదు.. మనం సింహం నుండి ఏమి నేర్చుకోవాలంటే వేగంగా పరిగెత్తాల్సిన అవసరం లేదు.. స్మార్ట్ కావాల్సిన అవసరం లేదు.. తెలివైన వాడికి అవ్వాల్సిన అవసరం లేదు.. నీకు ఉండాల్సింది.. కావాల్సిందల్లా ధైర్యం.. బోల్డ్ నెస్.. నీపై నీకు నమ్మకం.. ఇవన్నీ సింహానికి ఉంటాయి.. ఇప్పుడు అది బయటకి తీసే టైం వచ్చింది. నీలో కూడా ఒక సింహం ఉన్నాడు అంటూ ఎండ్ అవుతుంది.
పూరీ జగన్నాథ్ ట్వీట్(puri jagannadh tweet)
పూరీ జగన్నాథ్ ట్వీట్(puri jagannadh tweet)

ఈ వీడియో ఇప్పుడెందుకు పోస్ట్ చేసాడనేది ఎవరికీ అర్థం కాని విషయం. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో బాలయ్య వర్గం.. మెగా వర్గం మధ్య కొన్ని రోజులుగా వివాదాలు నడుస్తున్నాయి. సాధారణంగా బాలయ్యను లయన్, నటసింహం అంటారు. ఇక్కడ పూరీ చెప్తున్న సింహం బాలయ్యేనా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. అన్నింటికి మించి మీటింగ్స్‌ అన్నీ బాలయ్య లేకుండానే జరిగాయి. అక్కడ సింహం లేకపోయినా కూడా సింహమే అంటూ వీడియో పోస్ట్ చేసాడు పూరీ జగన్నాథ్.. దీన్నిబట్టి బాలయ్యను ఉద్ధేశ్యించి ఈ వీడియో పెట్టాడంటున్నారు అభిమానులు కూడా. మరి దీనిపై పూరీ ఎలాంటి క్లారిటీ ఇస్తాడో మరి.
Published by: Praveen Kumar Vadla
First published: May 31, 2020, 8:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading