మరో ఇస్మార్ట్ శంకర్‌కు ప్లాన్ చేస్తున్న పూరి... హీరో అతడే...

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరోసారి టాలీవుడ్ దృష్టిని తనవైపు తిప్పుకున్న పూరి జగన్నాధ్... మరోసారి ఇస్మార్ట్ శంకర్ రేంజ్‌ సక్సెస్ ఇవ్వాలని గట్టి పట్టుదలగా ఉన్నాడని తెలుస్తోంది.

news18-telugu
Updated: August 8, 2019, 7:36 PM IST
మరో ఇస్మార్ట్ శంకర్‌కు ప్లాన్ చేస్తున్న పూరి... హీరో అతడే...
పూరీ జగన్నాథ్ (Source: Twitter)
  • Share this:
హీరోల్లోని మాస్ స్టామినాను ఆన్ స్క్రీన్‌పై పర్ఫెక్ట్‌గా చూపించే అతికొద్ది మంది దర్శకుల్లో పూరి జగన్నాధ్ ఒకరు. వరుస పరాజయాలు ఎదురైనా... తనదైన స్టయిల్లో ఇస్మార్ట్ శంకర్ సినిమాను తెరకెక్కించి మరోసారి సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు పూరి. తాను సక్సెస్ అందుకోవడంతో పాటు హిట్ చూసి ఏళ్లు గడిచిన హీరో రామ్‌కు కూడా మెమొరబుల్ సక్సెస్‌ను అందించాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరోసారి టాలీవుడ్ దృష్టిని తనవైపు తిప్పుకున్న పూరి జగన్నాధ్... మరోసారి ఇస్మార్ట్ శంకర్ రేంజ్‌ సక్సెస్ ఇవ్వాలని గట్టి పట్టుదలగా ఉన్నాడని తెలుస్తోంది. ఇందుకోసం యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండను పూరి ఎంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ... పూరి డైరెక్షన్‌లో నటించేందుకు ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను పూరి స్వయంగా నిర్మించబోతున్నాడని సమాచారం. దసరా తరువాత ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని... వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ క్రేజీ కాంబినేషన్‌లోని సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్‌లో ఉండటం ఖాయమనే చెప్పాలి.


First published: August 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు