హోమ్ /వార్తలు /సినిమా /

లాక్‌డౌన్‌లో బాలయ్యను లాక్ చేసిన పూరీ జగన్నాథ్.. ఈ సారి దబ్బిడి దిబ్బిడే..

లాక్‌డౌన్‌లో బాలయ్యను లాక్ చేసిన పూరీ జగన్నాథ్.. ఈ సారి దబ్బిడి దిబ్బిడే..

‘టెంపర్’ తర్వాత సరైన సక్సెస్‌లేని పూరీ జగన్నాథ్ గత యేడాది రామ్‌తో తీసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.

‘టెంపర్’ తర్వాత సరైన సక్సెస్‌లేని పూరీ జగన్నాథ్ గత యేడాది రామ్‌తో తీసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.

‘టెంపర్’ తర్వాత సరైన సక్సెస్‌లేని పూరీ జగన్నాథ్ గత యేడాది రామ్‌తో తీసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.

  ‘టెంపర్’ తర్వాత సరైన సక్సెస్‌లేని పూరీ జగన్నాథ్ గత యేడాది రామ్‌తో తీసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్.. విజయ్‌ దేవరకొండతో ‘ఫైటర్’అనే ప్యాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్.. మరోసారి బాలకృష్ణతో అదిరిపోయే లెవల్ స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం లాక్‌డౌన్ సందర్భంగా ఓ కథను రెడీ చేసి బాలయ్యకు ఫోన్‌లో వివరించినట్టు సమాచారం. దీనికి బాలకృష్ణ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమా సరిగా నడవకపోయినా.. ఈ సినిమాలో బాలయ్యను కొత్తగా చూపించి పూరీ జగన్నాథ్ మంచి మార్కులే కొట్టేశాడు. ఇక బాలకృష్ణ కూడా తనను కొత్తగా చూపించిన పూరీ టేకింగ్‌కు ఫిదా అయి అపుడే అతనితో రెండో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్.. మరోసారి బాలయ్యతో పవర్‌ఫుల్ కథను రెడీ చేస్తున్నట్టు సమాచారం. పైసా వసూల్‌లో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా పర్ఫెక్ట్‌గా ఈ సినిమాను తెరెక్కించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాతో బాలయ్యకు ఆయన కెరీర్‌లోనే మెమరబుల్ హిట్ ఇస్తానని చెబుతున్నాడు పూరీ. మరోవైపు పూరీ జగన్నాథ్.. మహేష్ బాబుతో ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నట్టు సమాచారం.

  director puri jagannadh next movie with nandamuri balakrishna after paisa vasool movie,balakrishna,puri jagannadh,balakrishna nandamuri puri jagannadh,puri jagannadh,balayya,balayya trendes,balayya twitter,balakrishna facebook,puri jagannadh twitter,puri jagannadh instagram,puri jagannadh balakrishna paisa vasool,puri jagannadh ismart shankar,nandamuri balakrishna,puri jagannadh emotinoal words about balakrishna,puri jagannadh about balakrishna,balakrishna about puri jagannadh,director puri jagannadh emotinoal words about balakrishna,puri jagannadh about balayya,puri jagannadh interview,puri jagannadh emotinoal words about balayya,puri jagannadh to direct balakrishna,puri jagannadh about balakrishna look,telugu cinema,బాలకృష్ణ నందమూరి,పూరీ జగన్నాథ్,బాలయ్య పూరీ,పైసా వసూల్ పూరీ జగన్నాథ్ బాలకృష్ణ,తెలుగు సినిమా,ఇస్మార్ట్ శంకర్,బాలకృష్ణ పూరీ జగన్నాథ్,బాలయ్యతో పూరీ జగన్నాథ్
  పూరీ దర్శకత్వంలో పైసా వసూలు సినిమా చేసిన బాలకృష్ణ (File/Photo)

  మొత్తానికి అప్పట్లో ఎన్టీఆర్‌తో మొదటిసారి చేసిన ‘ఆంధ్రావాలా’తో సరైన సక్సెస్ ఇవ్వని పూరీ జగన్నాథ్.. ఆ తర్వాత ‘టెంపర్’ తో తారక్క‌కు మెమరబుల్ హిట్ అందించాడు పూరీ జగన్నాథ్. ఇపుడు అలానే బాలయ్యతో మొదటిసారి చేసిన ‘పైసా వసూల్’తో సక్సెస్ ఇవ్వని పూరీ జగన్నాథ్.. రెండో సినిమాతో హిట్టు ఇచ్చి బాలకృష్ణ రుణం తీర్చుకుంటాడా లేదా అనేది చూడాలి.

  First published:

  Tags: Balakrishna, NBK, Puri Jagannadh, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు