ఎన్టీఆర్‌తో చేసిన ‘టెంపర్’ తర్వాత హిట్టు కోసం పూరీ జగన్నాథ్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ‘టెంపర్’ తర్వాత చేసిన ‘జ్యోతిలక్ష్మి’, ‘లోఫర్’, ‘ఇజం’, ‘రోగ్’, తర్వాత బాలయ్యతో చేసిన ‘పైసా వసూల్’ కూడా పూరీకి హిట్టు ఇవ్వలేకపోయాయి.
ఆ తర్వాత కొడుకు ఆకాష్ పూరీతో చేసిన ‘మెహబూబా’ కూడా అడ్రస్ లేకుండా పోయింది. తాజాగా పూరీ జగన్నాథ్..రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ అనే టైటిల్‌తో ఒక సినిమా చేస్తున్నాడు.
Few more hours for the launch of #iSmartShankar 🔥@purijagan @ramsayz @Charmmeofficial @PuriConnects#RaPo17 #Puri35 #PCFilm pic.twitter.com/iVE76NzHc2
— Vamsi-Shekar (@UrsVamsiShekar) January 23, 2019
ఈ రోజు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో రామ్, దర్శకుడు పూరీ జగన్నాథ్, చార్మి, రామ్ పెదనాన్న రవికిషోర్ పాల్గోన్నారు. అంతేకాదు ఈ ముహూర్తపు సన్నివేశానికి చార్మి క్లాప్ కొట్టగా..రవికిషోర్ కెమెరా స్విచ్ఛాన్ చేసాడు.
ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ సహకారంతో పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.‘ఇస్మార్ట్ శంకర్’ లో రామ్ ..పూర్తి హైదరాబాద్‌కు చెందిన డబుల్ దిమాక్ ఇస్మార్ట్ పోరడి పాత్రలో నటిస్తున్నాడు.
పూరీ స్టైల్లో పక్కా యాక్షన్ ఎంటర్టేనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అను ఇమాన్యుయేల్‌ను ఒక హీరోయిన్గా అనుకుంటున్నారు. మరో కథానాయిక కోసం బాలీవుడ్ భామను కానీ కొత్త అమ్మాయిని కానీ తీసుకోవాలనే ఆలోచనలో ఉంది చిత్ర బృందం.
రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. హీరోగా రామ్‌కు ఇది 17వ సినిమా. దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు 35 సినిమా. ‘ఇస్మార్ట్ శంకర్’ విజయం అటు పూరీ.. ఇటు రామ్ ఇద్దరికి కీలకంగా మారింది. కొన్నేళ్లుగా వరస ప్లాపుల్లో ఉన్న పూరీ ఈ సినిమాతో హిట్ కొడతాను అని ధీమాగా చెబుతున్నాడు. మరి ఈయన ఆశ ఎంతవరకు తీరుతుందో చూడాలి.
బాలీవుడ్ హాట్ కపుల్స్
ఇవి కూడా చదవండి
రామ్ గోపాల్ వర్మ కొంటె ప్రశ్న..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో వాళ్లిద్దరు ఎవరు..
శంకర్, రాజమౌళిలో ఎవరు బెస్ట్ డైరెక్టర్ ?
బాహుబలి ఖాతాలో మరో అరుదైన రికార్డు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ram Pothineni, Telugu Cinema, Tollywood