లైగర్( Liger)సినిమాతో తన స్టామినా, క్రేజ్‌ని రెట్టింపు చేసుకున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannad).ఆడియన్స్‌కి కిక్కిచ్చే సినిమాలు, మాస్ డైలాగులు, వెరైటీ లవ్ స్టోరీలు, సినిమాల్లో హీరో పాత్రను డిఫరెంట్ షేడ్‌లో చూపించిన దర్శకుడిగా మంచి పేరు సంపాధించుకున్నారు పూరీ. అన్నీ వంద రోజుల సినిమాలు తీయకపోయినా తన ప్రతి సినిమాని వంద రోజుల్లోపే ఫినిష్ చేసి నిర్మాతల డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. అయితే పూరీ జగన్నాథ్ ట్రెండ్ సెట్ చేసే సినిమాలు తీసిన రోజుల్లో సోషల్ మీడియా(Social media)ఇప్పుడున్నంతగా అందుబాటులో లేకపోవడంతో ఎప్పటికి టాప్ డైరెక్టర్‌గా నిలవాల్సిన దర్శకుడు వెనుకబడిపోయారు. అందుకే ఇప్పుడు ఫామ్‌లో ఉన్న దర్శకులను అనుసరించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇది ఎవరో సినిమా అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన వాళ్లు చెప్పిన మాట కాదు. స్వయంగా పూరి జగన్నాదే లైగర్ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar)చేసిన ఇంటర్వూ (Interview)లో చెప్పిన మాటలు. అసలు ఇంటర్వూలో పూరీ జగన్నాథ్ షాకింగ్ విషయాలు చెప్పారు.
వెయ్యి కోట్లు పక్కా: సుకుమార్
మాస్, క్లాస్, లవ్ స్టోరీ, కమర్షియల్ సినిమా ఏదైనా తనదైన శైలీలో మార్చగలిగిన దర్శకుడు పూరీ జగన్నాథ్ . ఇస్మార్ట్ శంకర్‌కు ముందు వరుస ఫ్లాపులతో వెనుకబడిపోయిన ఈ టెంపర్ డైరెక్టర్ లైగర్ మూవీతో మరోసారి బాక్సాఫీస్‌పై బాక్సింగ్ స్టోరీతో పంజా విసురుతున్నారు. ఈనెల 25న లైగర్ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ పూరీ జగన్నాథ్‌ను ఇంటర్వూ చేశారు. ఇందులో లైగర్ సినిమా కలెక్షన్లు వెయ్యి కోట్లు రాబడుతుందని..అంతకు మించే వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానని సుకుమార్ అంటే ..నిజంగానే వస్తాయని పూరీ జగన్నాథ్ బదులిచ్చారు.
పూరి ఓపెన్ అయ్యారు..
అలాగే స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన పూరీ జగన్నాథ్ ఫెయిల్యూర్‌కి కారణం ఏమిటని అడిగారు సుకుమార్. ఇప్పటి వరకు తన సినిమాలు త్వరగా పూర్తి చేయడానికి కథ, స్క్రిప్ట్ వర్క్ కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేస్తూ వచ్చానని .. ఇకపై సుకుమార్‌ని ఫాలో అవుతానంటూ తన ఫెయిల్యూర్‌కి రీజన్ చెప్పారు పూరీ జగన్నాథ్. బద్రీ, ఇడియట్, పోకిరి, టెంపర్ వంటి సినిమాల్లో కొత్తగా ఉండే పాత్రలు, డైలాగులు, క్యారెక్టర్‌లను ప్రజెంట్ చేసిన పూరీ జగన్నాథ్ తనకు రోల్ మోడల్ సుకుమార్ తెలిపారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తగ్గేదేలే అంటూ చేసే మానరిజాన్ని పూరి జగన్నాద్ సినిమాలు చూసే తాను ఫాలో అయ్యానని చెప్పారు.
విజయ్ లాంటి నటుడ్ని చూడలేదు : పూరి
బాక్సింగ్ స్టోరీతో సౌత్, నార్త్‌లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే దేనికి లైగర్‌కి వచ్చినంత పబ్లిసిటీ రాలేదు. ఎందుకంటే ఇందులో హీరో నత్తి క్యారెక్టర్ పెట్టి కొత్త ప్రయోగం చేశానని ..కచ్చితంగా నచ్చుతుందని పూరీ జగన్నాథ్ సుకుమార్‌కి చెప్పారు. లైగర్ సినిమాలో విజయ్‌దేవరకొండ చేసిన సహజన నటన తాను గడిచిన పదేళ్ల కాలంలో ఏ హీరో చూడలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. స్పాట్‌లో, బయట విజయ్ చాలా జన్యూన్‌గా ఉంటాడని చెప్పారు డైరెక్టర్ పూరీ.ఇంకా విచిత్రం ఏమిటంటే ఇప్పటి నుంచి సుకుమార్ లాగానే తాను సినిమాలు తీయాలనుకుంటున్నానని చెప్పారు టెంపర్ డైరెక్టర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Director sukumar, Liger Movie, Puri Jagannadh, Tolllywood