ఎన్టీఆర్‌తో సినిమాపై మాట మార్చిన ప్రశాంత్ నీల్.. లైన్‌లోకి మరో అగ్ర దర్శకుడు..

కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో  మూవీ ఉంటుందని ప్రకటన చేయడంపై శాండిల్ వుడ్‌లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ప్రశాంత్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్ని కన్నడలోనే ఉంటాయని ప్రకటించడంతో ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

news18-telugu
Updated: May 23, 2020, 9:10 PM IST
ఎన్టీఆర్‌తో సినిమాపై మాట మార్చిన ప్రశాంత్ నీల్.. లైన్‌లోకి మరో అగ్ర దర్శకుడు..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ Photo : Twitter
  • Share this:
తారక్..  ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా  మరో హీరోగా నటిస్తున్నాడు.  ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. దేశం ఎదుర్కొంటున్న సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కెజియఫ్ డైరెక్ట్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నట్టు వార్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అతనికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి.. ఇన్ డైరెక్ట్‌గా ఎన్టీఆర్‌తో సినిమా ఉంటుందని చెప్పాడు.

Ntr news,NTR to work with prashanth neel, Janhvi kapoor to romance with tarak , Ntr trivikram new film, pooja hegde,ntr,jr ntr,jr ntr politics,jr ntr tdp politics,rrr jr ntr,trivikram, ayinanu poyiraavale hasthinaku,ntr trivikram title ayinanu poyiraavale hasthinaku,ala vaikunthapurramloo,Trivikarm to work with NTR for his next movie,jr ntr,jr ntr new movie,jr ntr movies,jr ntr upcoming movie,trivikram,trivikram movies,jr ntr new look for his next movie revealed,ntr movies,jr ntr and trivikram srinivas new movie,jr ntr and trivikram srinivas new movie confirm,trivikram srinivas with jr ntr,jr ntr trivikram srinivas movie,anirudh music for trivikram and jr ntr next movie,jr ntr hard work for his new makeover,త్రివిక్రమ్,ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,అయినను పోయిరావలె హస్తినకు,అయినను పోయిరావలె హస్తినకు ఎన్టీఆర్,పూజాహెగ్డే, ప్రశాంత్ నీల్
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ Photo : Twitter


కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో  మూవీ ఉంటుందని ప్రకటన చేయడంపై శాండిల్ వుడ్‌లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కోలీవుడ్ అగ్ర దర్శకుడిగా సత్తా చాటిన శంకర్ ఇప్పటి వరకు తమిళ హీరోలతోనే సినిమాలు తెరకెక్కించాడు. వేరే హీరోల వైపు చూడలేదు. అలాగే దర్శకుడు రాజమౌళి కూడా తెలుగు హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. వేరే భాషల హీరోలతో సినిమాలు చేయడం లేదు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్న కానీ మెయిన్ హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. కానీ కేజీఎఫ్‌తో కన్నడ చిత్ర పరిశ్రమ గురించి అందరికీ తెలిసేలా చేసిన ప్రశాంత్ నీల్.. కూడా శంకర్, రాజమౌళిలా వాళ్ల భాషల హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ కూడా కేవలం కన్నడ హీరోలతోనే సినిమాలు చేయాలని అక్కడి ప్రేక్షకులు పట్టు పడుతున్నారు. దీంతో ప్రశాంత్ నీల్.. తన తర్వాతి సినిమాలన్ని కన్నడలోనే ఉంటాయని చెప్పాడు. దీంతో ఆయన ఎన్టీఆర్‌తో సినిమా ఉంటుందా లేదా అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో కన్నడ సినిమా చేస్తాడా అనే అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. గతంలో శ్రీమంజునాథ విషయంలో రాఘవేంద్రరావు కన్నడలో తెరకెక్కించి మిగతా భాషల్లో డబ్ చేసారు.

అట్లీ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ (Twitter/Photo)


గతంలో ఎంతో మంది తెలుగు దర్శకులు తమిళం, కన్నడ, హిందీలో చిత్రాలను తెరకెక్కించారు. అలాగే తమిళ, కన్నడ, మలయాళ దర్శకులు కూడా తెలుగుతో పాటు హిందీలో సినిమాలను తెరకెక్కించారు. అలాంటిది ఏ భాషకు చెందిన దర్శకులు ఆయా భాషల్లోనే సినిమాలు తీయాలని ప్రేక్షకులు చెప్పడం సరికాదంటున్నారు చాలా మంది. ఒకవేళ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ సినిమా క్యాన్సిల్ అయితే.. నెక్ట్స్ అట్లీ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌లో నెక్ట్స్ మూవీ చేయడానికి ఎన్టీఆర్ ప్లాన్ బీ రెడీ చేసిపెట్టుకున్నాడు. కేజీఎఫ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ మూవీ క్యాన్సిల్ అయితే అట్లీతో ఎన్టీఆర్ తన 31వ చిత్రం చేయవచ్చని చెబుతున్నారు.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading