హోమ్ /వార్తలు /సినిమా /

NTR 31: ఎన్టీఆర్ సినిమాకు.. పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్ ?

NTR 31: ఎన్టీఆర్ సినిమాకు.. పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్ ?

NTR Photo : Twitter

NTR Photo : Twitter

ఎన్టీఆర్ 31 సినిమా టైటిల్‌పై ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానులు కూడా ఈ టైటిల్ అయితే బావుంటుందని అంటున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఇదే టైటిల్ ప్రకటిస్తారో లేదో చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ (jr ntr) ఆర్ఆర్ఆర్ (RRR) సక్సెస్ తర్వాత వరుస సినిమాల్ని లైన్‌లో పెట్టాడు. కొరటాల శివ డైరెక్షన్‌‌లో ఎన్టీఆర్ 30 (NTR 30) సినిమా తెరకెక్కుతుంది. మరోవైపు కేజీఎఫ్ (KGF) డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో(Prashanth Neel) కలిసి ఎన్టీఆర్ 31 సినిమా చేస్తున్నాడు. యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌‌తో ప్రశాంత్ నీల్ సినిమా అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. కేజీఎఫ్ 2 (kgf 2) కు ముందు వరకు ఈ సినిమాపై ఓ అంచనాలు ఉన్నాయి. కాని కేజీఎఫ్ 2 విడుదల అయ్యి వెయ్యి కోట్లకు పైగా నే వసూళ్లు చేసిన తర్వాత ఎన్టీఆర్‌ 31 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.ఎన్టీఆర్‌ 31 కి ప్రశాంత్ నీల్ దర్శకుడు అంటూ ఎప్పుడో క్లారిటీ వచ్చింది. అయితే తాజాగా ఎన్టీఆర్ 31 సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకు టైటిల్ ఒకటి ఫిక్స్ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఎన్టీఆర్ 31 చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాకు మంచి పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టె ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.. ఆ టైటిల్ కూడా ‘అసుర’ లేక ‘అసురుడు’ అని వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ హీరోలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో సినిమా టైటిల్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాయి.. ‘ఉగ్రం’, ‘కెజిఎఫ్’, ‘సలార్’.. ఇప్పుడు ‘అసుర’.. ఈ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి యాప్ట్ గా సరిపోయినట్లు కనిపిస్తుంది అంటున్నారు పలువురు ఎన్టీఆర్ అభామానులు. దీంతో ఫ్యాన్స్ కూడా ఇదే టైటిల్ ని ఫిక్స్ చేస్తే బావుంటుందని భావిస్తున్నారు. అయితే టైటిల్ విషయంలో ఇంకా ఎలాంటి ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని సమాచారం. టైటిల్ పై మరొకసారి చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కలిసి చర్చించి సినిమా టైటిల్ ఫైనల్ చేసే అవకాశాలున్నాయి.


మరోవైపు ఆర్ఆర్ తర్వాత .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వెకేషన్ మోడ్‌లో ఉన్నాడు. తారక్ కుటుంబంతో కలిసి సింగపూర్ కు వెళ్ళాడు. ఇక వెకేషన్ నుంచి తిరిగి రాగానే సెట్స్ లో ఎన్టీఆర్ 31 కోసం అడుగుపెట్టనున్నాడు. పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరి చూపు ఎన్టీఆర్ 31 మీదనే ఉన్నాయి. ‘కెజిఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ లో అగ్ర దర్శకులలో ఒకరిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ప్రశాంత్ ప్రస్తుతం ప్రభాస్ (Prabhas)తో సలార్ (Salaar) యాక్షన్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

First published:

Tags: Jr ntr, NTR 30, Prashanth Neel

ఉత్తమ కథలు