ఎన్టీఆర్‌ సినిమాపై అఫీషియల్ ప్రకటన చేసిన క్రేజీ డైరెక్టర్..

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా క్రేజీ డైరెక్టర్ ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాను కన్పామ్ చేసాడు.

news18-telugu
Updated: May 20, 2020, 1:18 PM IST
ఎన్టీఆర్‌ సినిమాపై అఫీషియల్ ప్రకటన చేసిన క్రేజీ డైరెక్టర్..
అందుకే చాలా జాగ్రత్తగా ప్యాన్ ఇండియన్ కథలను.. అలాంటి దర్శకులను ఎంచుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ప్రశాంత్ నీల్ సినిమా కోసం కూడా ఏకంగా రెండేళ్లకు పైగా డేట్స్ ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.
  • Share this:
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా  మరో కథానాయికుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.  ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. దేశం ఎదుర్కొంటున్న సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కెజియఫ్ డైరెక్ట్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నారు. ప్రశాంత్ నీల్‌ కెజియఫ్‌తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో హీరో ఎలివేషన్ ఓ రేంజ్‌లో ఉంటూ ఊర్రుతలూగిస్తుంది. దీంతో ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ సినిమా అంటే అంచనాలు మరో రేంజ్‌లో ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్ కథను సిద్ధం చేస్తున్నట్టు  గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెష్ తెలియజేస్తే.. అతనితో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు చెప్పకనే చెప్పాడు.


కేజీఎఫ్ 2 తర్వాత ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే చిత్రంపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ సినిమా తర్వాత వచ్చే యేడాది పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ తన  పుట్టినరోజు సందర్భంగా అభిమానులు మంచి గిఫ్టే ఇచ్చాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 20, 2020, 1:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading