ఆసక్తిరేకిస్తున్న ప్రశాంత్ వర్మ ‘కరోనా వ్యాక్సిన్’ మోషన్ పోస్టర్..

కరోనా వ్యాక్సిన్ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ చిత్రం (Twitter/Photo)

మొదటి సినిమా ‘అ’ తోనే అందరినీ ఆశ్చర్యపోయేలా చేసి జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తాజాగా ఈయన కరోనా వ్యాక్సిన్ పేరుతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసాడు.

  • Share this:
    మొదటి సినిమా ‘అ’ తోనే అందరినీ ఆశ్చర్యపోయేలా చేసి జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ అతనికి మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆ చిత్రానికి సీక్వెల్ కూడా తీయనున్నట్లు ప్రశాంత్ వర్మ అప్పట్లో తెలిపాడు. ప్రశాంత్ వర్మ అ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా కల్కి అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా పెద్దగా అలరించలేకపోయినా.. ప్రశాంత్ వర్మ టేకింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈయన ప్రస్తుతం తమన్నా హీరోయిన్‌గా ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ  సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఆ సంగతి పక్కనపెడితే.. తాజాగా ఈ దర్శకుడు ‘కరోనా వ్యాక్సిన్’ అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ఈ  రోజు అతని పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్‌ కూడా రిలీజ్ చేసాడు.

    ప్రస్తుతం కరోనా వల్ల ఎర్పడిన పరిస్థితులను ఈ సినిమాలో చర్చించనున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుంది. దీని ప్రభావం దేశాలపై మరియు ప్రజలపై ఎంత దారుణమైన ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించనున్నాడు. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టే క్రమంలో మన పరిశోధకులు ఎలాంటి అనుభవాలు ఫేస్ చేసారన్నదే ఈ సినిమా స్టోరీ. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానీ సరికొత్త కాన్సెప్ట్‌తో  ప్రశాంత్ వర్మ.. ‘కరోనా వ్యాక్సిన్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర అవస్థలకు గురౌతున్నారు. కరోనా దెబ్బతో అన్నిరంగాలు కుదేలవుతున్నాయి. అందులో భాగంగా సినీ ఇండస్ట్రీ కూడా కుంటుపడింది. దీంతో తెలుగు సినిమాల షూటింగ్స్ పూర్తిగా రద్దయ్యాయి. అంతేకాదు విడుదల కావాల్సిన చాలా సినిమాలు కూడా వాయిదా పడిన సంగతి తెలసిందే కదా. మొత్తానికి ప్రశాంత్ వర్మ.. కరోనా వ్యాక్సిన్‌ను తన సినిమాలో ఎలా కనిపెడతాడా అనేది ఆసక్తికరంగా మారింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: