హోమ్ /వార్తలు /సినిమా /

Parusuram: మహేష్ తర్వాత పరుశురాం సినిమా.. ఆ యంగ్ హీరోతేనే..

Parusuram: మహేష్ తర్వాత పరుశురాం సినిమా.. ఆ యంగ్ హీరోతేనే..

పరుశురాం

పరుశురాం

వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని ఎప్పటి నుంచి అంటున్నారు. ఇప్పుడు మహేష్ మూవీ పూర్తవ్వడంతో... పరుశురాం ఆ యంగ్ హీరోను లైన్‌లో పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

  సర్కారు వారి పాట థియేటర్లలో సందడి చేసేందుకు సిద్దమవుతోంది. పరుశురాం డైరెక్షన్‌ మహేష్ బాబు హీరోగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కాస్త రిలీజ్‌కు రెడీ అవ్వడంతో.. పరుశురాం.. తన నెక్ట్స్ చేపట్టబోయే ప్రాజెక్టులపై ఫోకస్ పెడుతున్నాడు. తాజాగా ఆయన తర్వాత చేయబోయే సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు. అక్కినేని హీరో... నాగైచైతన్యతో పరుశురాం తన తర్వాత తీయబోయే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఎప్పటి నుంచో నాగ చైతన్యతో పరశురామ్ కాంబోలో సినిమా ఉండనుందనే టాక్ వచ్చింది. మహేశ్ తో సినిమా ఛాన్స్ రావడం అంత తేలికైన విషయం కాదు. దీంతో పరుశురాం ఆ అవకాశాన్ని వదులుకోకుండా.. చైతన్యతో చేయాల్సిన కథను పక్కన పెట్టాడు. మహేష్ డేట్స్ కుదరడంతో... సర్కారు వాటి పాటను సిల్వర్ స్క్రీన్ ఎక్కించాడు.

  ఇప్పుడు చైతూ ప్రాజెక్టును పరశురామ్ చేయకపోవచ్చుననే ప్రచారం ఇండస్ట్రీలోగట్టిగానే జరిగింది. కాని ఈ విషయంలో డైరెక్టర్ పరుశురామ్ పక్కాగా క్లారిటీ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో పరశురామ్ మాట్లాడుతూ .. తన తదుపరి సినిమా నాగచైతన్యతోనే ఉంటుందని స్పష్టం చేశాడు. అంతా రెడీగానే ఉంది గనుక త్వరలోనే సెట్స్ పైకి వెళతామని అన్నాడు. అయితే అక్కినేని హీరోతో పరుశురాం సినిమా చేస్తానడంతో ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగచైనతన్యకు.. పరుశురాం సాలిడ్ హిట్ ఇవ్వడం ఖాయమని అక్కినేని అభిమానులు అప్పుడే అంచనాలు కూడా వేసేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే - రష్మికల పేర్లు వినిపిస్తున్నాయి.

  విశాఖ జిల్లాలో పుట్టిన పరుశురామ్.. 2002లో ఎంబిఏ పూర్తిచేసి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. తన బంధువు పూరి జగన్నాథ్ దగ్గర ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఆంధ్రావాలా, 143 సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తరువాత 2008లో పరుగు సినిమాకు భాస్కర్ దగ్గర అసోసియేట్ డైరెక్టరుగా పరుశురాం పనిచేశాడు. తొలిసారిగా 2008లో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా యువత సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమేకాకుండా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. 2009లో రవితేజ హీరోగా పరశురామ్ దర్శకత్వం వహించిన ఆంజనేయులు సినిమా కూడా సినీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

  2011లో నారా రోహిత్ హీరోగా వచ్చిన సోలో సినిమా కూడా మంచి సక్సెస్ ఇచ్చింది. 2018లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన గీత గోవిందం సినిమా సైతం పరుశురాంకు సూపర్ హిట్ అందించింది. ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు దర్శకత్వం వహించడంతో... ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మహేష్‌కు హిట్ ఖాయమని... ఆయన అభిమానులు అనుకుంటున్నారు. మే 12న సర్కారు వారి పాట థియేటర్లలో విడుదల కానుంది.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Naga Chaitanya, Naga Chaitanya Akkineni, Parusuram patla, Sarkaru Vaari Paata