హోమ్ /వార్తలు /సినిమా /

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ కోసం దర్శకుడు పరశురామ్ భారీ ప్లాన్..

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ కోసం దర్శకుడు పరశురామ్ భారీ ప్లాన్..

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ మొదలు కాలేదు.. డిసెంబర్ వరకు మొదలు కాదు కూడా. ఎందుకంటే కోవిడ్ కొలిక్కి వచ్చే వరకు తాను ఇంటి నుంచి అడుగు బయట పెట్టేది లేదని ఇప్పటికే మహేష్ బాబు తన టీంకు చెప్పేసాడు కూడా.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ మొదలు కాలేదు.. డిసెంబర్ వరకు మొదలు కాదు కూడా. ఎందుకంటే కోవిడ్ కొలిక్కి వచ్చే వరకు తాను ఇంటి నుంచి అడుగు బయట పెట్టేది లేదని ఇప్పటికే మహేష్ బాబు తన టీంకు చెప్పేసాడు కూడా.

మహేష్ బాబు ఇటీవల పరుశురామ్ దర్శకత్వంలో  ‘సర్కారు వారి పాట’ సినిమాను   ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం కోసం దర్శకుడు పరశురామ్..

  మహేష్ బాబు ఇటీవల పరుశురామ్ దర్శకత్వంలో  ‘సర్కారు వారి పాట’ సినిమాను   ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దర్శకుడు పరుశురామ్ సోషల్ మెసేజ్‌ కథతో తెరకెక్కించనున్నాడట. ఈ సినిమాలో ముఖ్యంగా అవినీతికి సంబంధించిన ఓ సామాజిక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాలో వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు. దానికి సంబందించి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది.ఈ సినిమా కోసం ఒక భారీ బ్యాంకు సెట్‌ను రెడీ చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ స్టూడియోలో ఈ బ్యాంక్ సెట్‌ను రెడీ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉందట. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. మరోవైపు విలన్‌గా సుదీప్ లేదా ఉపేంద్ర ఇద్దరిలో ఒకరు నటించేది మాత్రం ఫిక్స్ అని చెబుతున్నారు.

  మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)
  మహేష్ బాబు సర్కారు వారి పాట లుక్ (sarkaru vaari pata movie)

  డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. అప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో దర్శకుడు పరశురామ్ ఉన్నాడు. ‘సర్కారు వారి పాట’ సినిమాలో  సోషల్ మెసేజ్‌తో పాటు అదిరిపోయే రొమాంటిక్ సీన్స్ ఉంటాయట. అందులో భాగంగా చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నాడని తెలుస్తోంది. కాఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Keerthy Suresh, Mahesh babu, Sarkaru vaari pata, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు