• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • DIRECTOR NANDYALA RAVI PASSES AWAY DUE TO COVID19 SR

Director Nandyala Ravi Passes away : కరోనాతో కన్నుమూసిన ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు..

Director Nandyala Ravi Passes away : కరోనాతో కన్నుమూసిన ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు..

Nandyala Ravi Photo : Twitter

Nandyala Ravi Passes away : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ప్రముఖ యువ రచయిత, దర్శకుడు నంద్యాల రవి కరోనాతో శుక్రవారం కన్నుమూశారు.

  • Share this:
    Nandyala Ravi Passes away : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ప్రముఖ యువ రచయిత, దర్శకుడు నంద్యాల రవి కరోనాతో శుక్రవారం కన్నుమూశారు. రచయితగా పలు సినిమాలకు పని చేసిన రవి.. నాగశౌర్య, అవికా గోర్ నటించిన ‘‘లక్ష్మీ రావే మా ఇంటికి’’ మూవీతో దర్శకుడిగా మారారు. ఆ సినిమా తర్వాత ఆయన కొండా విజయ్ కుమార్, రాజ్ తరుణ్‌తో చేసిన ‘ఒరేయ్.. బుజ్జిగా’, ‘పవర్ ప్లే’ సినిమాలకు రచయితగా పనిచేశారు. నంద్యాల రవి కొన్ని రోజుల ముందు కరోనా బారిన పడటంతో ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆరోగ్య ప‌రిస్థితి విష‌య‌మించ‌డంతో ఈరోజు క‌న్నుమూశారు. కరోనాతో హాస్పిటల్‌లో చేరిన రవి కుంటుంబం ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో నటుడు స‌ప్త‌గిరి ల‌క్ష రూపాయ‌లు ఆర్థిక సాయం అందించారు. పలు చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన నంద్యాల రవి, లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాను డైరెక్ట్ చేశారు.


    నటుడు స‌ప్త‌గిరితోనూ ఓ సినిమా చేయ‌డానికి క‌థ‌ను సిద్ధం చేసుకున్నారు. కానీ క‌రోనా ఆయ‌న్ని క‌బ‌లించింది. నంద్యాల ర‌వి మృతిపై సినీ ప్ర‌ముఖులు త‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే కరోనా కారణంగా పలువురు సెలబ్రిటీలు కన్నుమూశారు. రెండు రోజుల కింద పాపులర్ యూట్యూబ్ యాంకర్, జర్నలిస్ట్ టీఎన్ఆర్ మరణించారు. ఆ మధ్య ప్రముఖ సింగర్ బాలు కూడా కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.
    Published by:Suresh Rachamalla
    First published: