థియేటర్స్‌లో మద్యం అమ్మకాలు..ప్రభుత్వానికి టాలీవుడ్ అగ్ర దర్శకుడు సలహా..

థియేటర్స్‌లో మద్యం అమ్మకాలు (Twitter/Photo)

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా  షూటింగ్స్ అన్నీ తాత్కాలికంగా రద్దు అయ్యాయి. లాక్‌డౌన్ తర్వాత లాస్‌లో ఉన్న థియేటర్స్‌ను ఆదుకోవడానికి అందులో మధ్యం అమ్మకాలకు ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వాలని ప్రముఖ దర్శకుడు కోరుతున్నాడు.

 • Share this:
  కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా  షూటింగ్స్ అన్నీ తాత్కాలికంగా రద్దు అయ్యాయి. అంతేకాకుండా థియేటర్స్ కూడా మూత పడ్డాయి. ఈ లాక్ డౌన్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళా లాక్ డౌన్ తొలగించిన కూడా జనాలు సినిమా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అయితే ఇన్ని రోజులు థియేటర్స్‌కు టీవీల నుంచి గట్టి పోటీ అనుకుంటే.. తాజాగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ థియేటర్స్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఇప్పటికే కొంత మంది నిర్మాతలు తమ సినిమాలను లాక్‌డౌన్ కారణంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేస్తున్నారు.లాక్‌డౌన్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అవుతాయా లేదా అనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ కారణంగా మన దేశంలోని అన్ని చిత్రపరిశ్రమలు దాదాపు రూ. 3 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అంచనా.  ఒక్క టాలీవుడ్ చిత్ర పరిశ్రమనే రూ. 800 కోట్ల మేర నష్టాలను చవిచూసినట్టు సమాచారం. గత 50ఏళ్లలో చిత్ర పరిశ్రమ ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎపుడు చూడలేదు. కేవలం ఇది మన దేశానికి చెందిన చిత్ర పరిశ్రమకే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలకు ఈ ఎఫెక్ట్ భారీగా ఉంది.

  director nag ashwin request to governemet if theatres get license to serve wine,coronavirus,theatres,theatres get license to serve wine,theatres get serve wine,nag ashwin,theatres nag ashwin,nag ashwin,corona lockdown theatres implemented these rules,chiranjeevi,balakrishna,pawan kalyan,jr ntr,ram charancorona virus effect,corona virus effect on telugu film industry, coronavirus,coronavirus nani,nani v movie postponed,v moive postponed due to these reasons,sudheer babu v movie teaser,nani 25,nani 25th movie bollywood huge loss to corornavirus effect,baaghi 3 coronavirus,sooryavanshi coronavirus effect,bollywod loss uptt 1000 crore rupees,corona virus effect no public in cinema halls,corona effcect no public in roads,prabhas,corona virus effect bahubali fame prabhas wearing mask,prabhas corona virus effect,prabhas airport,బాక్సాఫీస్‌కు కరోనా దెబ్బ,బాక్పాఫీస్ కు కరోనా వైరస్,కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో కలెక్షన్లు ఢమాల్,కరోనా దెబ్బతో వెయ్యి బాలీవుడ్‌కు వెయ్యి కోట్ల నష్టం.జూనియర్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్, రామ్ చరణ్,బాలకృష్ణ,చిరంజీవి,కరోనా కారణంగా థియేటర్స్‌లో ఛేంజ్ అయ్యే రూల్స్ ఇవే,నాగ్ అశ్విన్నాగ్ అశ్విన్,థియటర్స్‌లో మద్యం అమ్మకాలు
  థియేటర్స్‌లో మధ్యం అమ్మకాలు (Twitter/Photo)

  సినిమా కలెక్షన్లపై కరోనా ప్రభావం ఏ రకంగా ఉంటుందనే విషయం రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలైతే కానీ తెలియదు. లాక్‌డౌన్ తర్వాత  ప్రజలు థియేటర్స్ వైపు రావడానికి మల్టీప్లెక్స్ యాజమాన్యం ఇప్పటికే సీట్ల తగ్గించి మనిషికి మనిషికి మధ్య మూడు సీట్లు గ్యాప్ ఉండేలా సిటింగ్ సిస్టమ్ మార్చనున్నట్లు సమాచారం. మాములు సింగిల్ థియేటర్స్ యాజమాన్యం వాళ్లు  కేవలం 50 శాతం టికెట్లు మాత్రమే అమ్మాలనే కొత్త నిబంధనను అనుసరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో థియేటర్స్‌ను ఆదుకోవడానికి థియేటర్స్‌లో వైన్, బీర్, బ్రీజర్ అమ్మకాలను చెేపట్టాలని ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ సూచిస్తున్నాడు. ఇప్పటికే విదేశాల్లో ఉన్న థియేటర్స్‌లో మద్యం అమ్ముతున్నారు. అదే తరహాలో ఇక్కడ థియేటర్స్‌లో కూడా మద్యం అమ్మితే కొద్దిలో కొద్దిగానైనా థియేటర్ రంగం పుంజుకుంటుందని చెప్పుకొచ్చారు. కరోనాతో పూర్తిగా చతికిల పడిన ఈ రంగాన్ని కాస్తో కూస్తో ఆదుకోవాలంటే ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదన్నారు.

  director nag ashwin request to governemet if theatres get license to serve wine,coronavirus,theatres,theatres get license to serve wine,theatres get serve wine,nag ashwin,theatres nag ashwin,nag ashwin,corona lockdown theatres implemented these rules,chiranjeevi,balakrishna,pawan kalyan,jr ntr,ram charancorona virus effect,corona virus effect on telugu film industry, coronavirus,coronavirus nani,nani v movie postponed,v moive postponed due to these reasons,sudheer babu v movie teaser,nani 25,nani 25th movie bollywood huge loss to corornavirus effect,baaghi 3 coronavirus,sooryavanshi coronavirus effect,bollywod loss uptt 1000 crore rupees,corona virus effect no public in cinema halls,corona effcect no public in roads,prabhas,corona virus effect bahubali fame prabhas wearing mask,prabhas corona virus effect,prabhas airport,బాక్సాఫీస్‌కు కరోనా దెబ్బ,బాక్పాఫీస్ కు కరోనా వైరస్,కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో కలెక్షన్లు ఢమాల్,కరోనా దెబ్బతో వెయ్యి బాలీవుడ్‌కు వెయ్యి కోట్ల నష్టం.జూనియర్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్, రామ్ చరణ్,బాలకృష్ణ,చిరంజీవి,కరోనా కారణంగా థియేటర్స్‌లో ఛేంజ్ అయ్యే రూల్స్ ఇవే,నాగ్ అశ్విన్నాగ్ అశ్విన్,థియటర్స్‌లో మద్యం అమ్మకాలు
  థియేటర్స్‌లో మద్యం అమ్మాలంటున్న దర్శకుడు నాగ్ అశ్విన్ (Twitter/Photo)

  ఈ విషయమైన హీరో రానాతో పాటు నిర్మాత సురేష్ బాబును కలిసి దీనిపై చర్చించినట్టు  చెప్పుకొచ్చాడు. అదే విషయమైన నిర్మాతలందరు కలిసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే బాగుంటుందని అంటున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. థియేటర్స్‌లో మద్యం అమ్మాలనే నిర్ణయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయనేది చూడాలి. ఒకవేళ ఇచ్చినా.. ఫైవ్ స్టార్ తరహాలో ఎక్కువ రేటు ఉండే అవకాశం ఉంది. మొత్తానికి థియేటర్స్‌ రంగాన్ని ఆదుకోవడానికి  మద్యం అమ్మకాలపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో  చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published: