కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ‘మహానటి’ సినిమాతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నటనకు కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డును కైవసం చేసుకుంది. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్.. ప్రభాస్‌తో ప్యాన్ ఇండియా కాదు..కాదు.. ప్యాన్ వరల్డ్ సినిమా చేస్తానని అనౌన్స్ చేసాడు. ప్రభాస్‌తో చేయబోయే సినిమాను చందమామ కథ స్పూర్తితో పూర్తి సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్‌ను బట్టి ఈ సినిమాను రాజుల కాలం నాటి కథతో తెరకెక్కించబోతున్నట్టు అర్ధమవుతుంది. అందుకే కింగ్‌కు సరిపడేంత క్వీన్ కావాలి కదా. అందుకే ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు. ఈ జోడి వెండితెరపై పిచ్చక్కించడం ఖాయం అంటూ చెప్పుకొచ్చాడు.
King ki saripadentha Queen kavali kada mari...chaala alochinchi teesukunna decision idi...pichekkicheddam..🙏 #Prabhas21 #DeepikaPadukone #PrabhasNagAshwin #DeepikaPrabhas https://t.co/hwElHkKapG
— Nag Ashwin (@nagashwin7) July 19, 2020
దీపికా పదుకొణే సెలెక్షన్ పై నాగ్ అశ్విన్ స్పందించిన తీరుకు నెటిజన్లతో పాటు ప్రభాస్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్లో భారీ ఎత్తున నిర్మాత సి.అశ్వినీదత్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నరాధేశ్యామ్ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అ యేడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశ ముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aswani Dutt, Bollywood, Deepika Padukone, Nag Ashwin, Prabhas, Tollywood, Vyjayanthi Movies