నయనతార ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ నెల 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక దర్శకుడు మురుగదాస్.. అప్పట్లో నయనతారతో జరిగిన గొడవపై స్పందించారు. అప్పట్లో మురుగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా ‘గజినీ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో అసిన్‌తో పాటు నయనతార రెండో హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో నటించడం పట్ల నయనతార గతంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. అందులో తన పాత్రకు తక్కువ ప్రాధాన్యం ఉండటం కారణంగా చెప్పింది. అంతేకాదు అసలు గజినీ సినిమాకు ఓకే చెప్పడమే నేను తీసుకున్న అతి చెత్త నిర్ణయం. అంతేకాదు ముందుగా చెప్పినట్టు తన పాత్రను తీర్చిదిద్దలేదని వ్యాఖ్యలు చేసిన తెలిసిందే కదా. అప్పట్లో నా ఫోటోగ్రాఫ్ బాగా తీయలేదు. ఈ విషయంలో నేను ఎవరిపై ఫిర్యాదు చేయడం లేదని ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఐతే.. ఈ సినిమా వచ్చిన 14 ఏళ్ల తర్వాత.. నయన్ వ్యాఖ్యలపై మురుగదాస్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నటీనటుల వ్యక్తి గత అభిప్రాయాల అనుగుణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేయనని అన్నాడు. ఒక్కొసారి తనకు నచ్చని వారికి కూడా మంచి పాత్రలు ఇస్తుంటాం.ఒక్కోసారి మన ఫేవరేట్ నటీనటులకు చిన్న పాత్రలు కూడా ఇవ్వాల్సిన సందర్భాలొస్తాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AR Murugadoss, Darbar, Kollywood, Nayanthara, Rajinikanth, Tollywood