ఎన్టీఆర్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన మురుగదాస్..

దక్షిణాది చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఏ.ఆర్.మురుగదాస్‌ది ప్రత్యే శైలి అనే చెప్పాలి. డిపరెంట్ కథా చిత్రాలతో ప్రేక్షకులను థ్రిల్ చేయడం మురుగదాస్ స్పెషాలిటీ. తాజాగా ఈయన ‘దర్బార్’ తర్వాత ఎన్టీఆర్‌తో చేయబోయే చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: December 30, 2019, 8:00 AM IST
ఎన్టీఆర్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన మురుగదాస్..
ఎన్టీఆర్,ఏ.ఆర్.మురుగదాస్ (Twitter/Photos)
  • Share this:
దక్షిణాది చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఏ.ఆర్.మురుగదాస్‌ది ప్రత్యే శైలి అనే చెప్పాలి. డిపరెంట్ కథా చిత్రాలతో ప్రేక్షకులను థ్రిల్ చేయడం మురుగదాస్ స్పెషాలిటీ. ప్రస్తుతం ఈ దర్శకుడు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ‘దర్బార్’ సినిమా చేసాడు. ఈ చిత్రం జవనరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మురుగదాస్ మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలతో పాటు తెలుగు‌లో చేయబోయే ప్రాజెక్ట్‌లపై స్పందించాడు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్‌తో ఏ.ఆర్.మురుగదాస్ సినిమా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మురుగదాస్ మాట్లాడుతూ.. చాలా నెలల క్రితం ఒక కథతో ఎన్టీఆర్‌ను కలిసిన మాట నిజమే. ఈ కథకు తారక్ ఓకే చెప్పినా.. ఇంకా సబ్జెక్ట్ మెటీరిలైజ్ కాలేదన్నాడు. దీంతో ఈ సినిమా ఒద్దనుకున్నాం. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్‌తో సినిమా లేకపోయినా.. భవిష్యత్తులో మంచి కథతో ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేస్తా అని చెప్పుకొచ్చారు.

director murugadoss clarifies about jr ntr movie,rrr,rrr jr ntr,jr ntr,ar murugadoss,ntr,murugadoss, jr ntr twitter, jr ntr facebook, jr ntr instagram,ntr movies,murugadoss instagram,murugadoss facebook,murugadoss twitter,murugadoss rajinikanth darbar,darbar,murugadoss darbar movie,a r murugadoss,jr ntr movies,armurugadoss,ntr jai lava kusa,ntr latest movie,a r murgadoss movies,a r murgadoss movies list,ar murugadoss movie with ntr,murugadoss and ntr movie,ntr dialogues,mahesh babu,murugadoss direct with ntr,ntr temper,murugadoss interview with baradwaj rangan,ar murugadoss shocking decision on ntr,kollyowod,tollywood,ఏ.ఆర్.మురుగదాస్,ఎన్టీఆర్ జూనియర్,జూ ఎన్టీఆర్ ఏఆర్ మురుగదాస్,ఏఆర్ మురుగదాస్ రజినీకాంత్ దర్బార్ మూవీ,దర్బార్ మూవీ,ఆర్ఆర్ఆర్
ఎన్టీఆర్,ఏ.ఆర్.మురుగదాస్ (Twitter/Photos)


మురుగదాస్ విషయానికొస్తే.. ఈయన తెలుగులో చిరంజీవితో ‘స్టాలిన్’, మహేష్ బాబు‌తో ‘స్పైడర్’ సినిమాలను తెరకెక్కించాడు. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను నిరాశ పరిచిన సంగతి తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 30, 2019, 7:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading