Home /News /movies /

DIRECTOR MARUTHI OPEN COMMENTS ON PRABHAS MOVIE SLB

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. అదే తన కోరిక అంటూ మారుతి ఓపెన్ కామెంట్స్

Photo Twitter

Photo Twitter

Prabhas Maruthi Movie: ప్రభాస్‌తో సినిమా చేస్తున్న డైరెక్టర్ల లిస్టులో మారుతి కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్‌తో తన ప్రాజెక్టు గురించి ఓపెన్ అయ్యారు డైరెక్టర్ మారుతి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవలే ఆయన రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమా డిజాస్టర్ అయినప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో తన తదుపరి ప్రాజెక్ట్స్ వేగంగా ఫినిష్ చేస్తున్నారు. మరోవైపు జయాపజయాల సంగతి పక్కన బెట్టి ప్రభాస్‌తో సినిమాలు తీసేందుకు డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ఆయనతో రూపొందించే సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ కేటాయించి పాన్ ఇండియా లెవెల్ లోనే చిత్రీకరిస్తున్నారు. అయితే ప్రభాస్‌తో సినిమా చేస్తున్న డైరెక్టర్ల లిస్టులో మారుతి (Maruthi) కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్‌తో తన ప్రాజెక్టు గురించి ఓపెన్ అయ్యారు డైరెక్టర్ మారుతి.

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో తాను చేయబోతున్న సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మారుతి. ఈ సినిమా కథ ఎలా ఉండబోతోందనే విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే ప్రభాస్‌‌ను కలవడం జరిగిందని చెప్పిన మారుతి.. ఈ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఆయనతో ఓ మంచి సినిమా తీయాలనేది తన టార్గెట్ అని మారుతి అన్నారు. మళ్లీ డార్లింగ్ (Darling), బుజ్జిగాడు (Bujjigadu) లాంటి ఒక యాక్టివ్ ప్రభాస్‌ను చూపించాలేనేది తన కోరిక అంటూ ఓపెన్ అయ్యారు మారుతి.

ప్రభాస్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేయడం జరగని పని అని చెప్పిన మారుతి.. తాను ప్రభాస్‌కి గొప్ప అభిమానిని అని, ఆయన అట్యిట్యూడ్ ఏంటో.. పర్సనల్‌ ఆయనేంటో తనకు బాగా తెలుసని అన్నారు. ప్రభాస్ నుంచి ఆడియన్స్‌ ఏదైతే కోరుకుంటున్నారో అదే చూపిస్తాం అని మారుతి చెప్పారు. ప్రస్తుతం అవే పనుల్లో ఉన్నామని మారుతి చెప్పుకొచ్చారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.



ఇకపోతే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో సలార్ (Salaar), బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ (Adipurush) సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు ప్రాజెక్ట్ కే (Project k), స్పిరిట్‌ (Spirit) మూవీలను లైన్‌లో పెట్టారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఫినిష్ అయ్యాక మారుతి దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నారు. ఈ లెక్కన చూస్తే ప్రభాస్ లైనప్ మామూలుగా లేదని అర్థమవుతోంది కదూ!. పైగా ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్‌లో రానుండటం దేశ విదేశాల్లో ఆయన క్రేజ్ ఏంటో ప్రూవ్ చేస్తున్నాయి.
Published by:Sunil Boddula
First published:

Tags: Maruthi, Prabhas, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు