Home /News /movies /

DIRECTOR MARUTHI DASARI PLANNING HIS NEXT MOVIE WITH MACHO HERO GOPICHAND PK

మారుతి తర్వాతి సినిమా ఆ హీరోతోనా.. షాకిచ్చిన దర్శకుడు..

దర్శకుడు మారుతి ()Director Maruthi

దర్శకుడు మారుతి ()Director Maruthi

Director Maruthi: కొందరు దర్శకులు ఉంటారు.. హిట్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా కూడా వాళ్లు మాత్రం హీరోల వెంట పడరు. కథలు రాసుకుని దానికి తగ్గట్లు హీరోలను ఎంచుకుంటారు.

కొందరు దర్శకులు ఉంటారు.. హిట్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా కూడా వాళ్లు మాత్రం హీరోల వెంట పడరు. కథలు రాసుకుని దానికి తగ్గట్లు హీరోలను ఎంచుకుంటారు. అలాగే హీరోల కోసం కథలు రాయమన్నా కూడా రాస్తుంటారు. అలాంటి దర్శకుల్లో మారుతి కూడా ఉంటాడు. ఈయనకు హీరోను చూపించి కథ రాయమన్నా రాస్తాడు.. అలా కాదు కథ రాసుకుని హీరోను ఎంచుకోమంటే కూడా తీసుకుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు మారుతి. ప్రతిరోజూ పండగే లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈయన ఏ హీరోతో సినిమా చేస్తాడో అనే ఆసక్తి చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

సాయి తేజ్, మారుతి ప్రతిరోజూ పండగే ఓపెనింగ్
సాయి తేజ్, మారుతి ప్రతిరోజూ పండగే ఓపెనింగ్


అయితే ఇప్పటి వరకు తన తర్వాతి సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు ఈ దర్శకుడు. కానీ లాక్‌డౌన్‌లో మాత్రం మంచి కథ ఒకటి సిద్ధం చేసుకున్నాడు మారుతి. దానికి సంబంధించి స్క్రీన్ ప్లే కూడా పూర్తయిందని చెప్పుకొచ్చాడు. ఎప్పటికప్పుడు భిన్నమైన కథలు రాసుకునే మారుతి.. ప్రతిరోజూ పండగేతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఈ సారి కూడా పూర్తిగా కొత్త కథతోనే రాబోతున్నాడు ఈయన. అయితే ఇందులో హీరో ఎవరో మాత్రం చెప్పలేదు మారుతి.

మారుతి గోపీచంద్ (gopichand maruthi)
మారుతి గోపీచంద్ (gopichand maruthi)


అల్లు అర్జున్‌తో సినిమా ఉంటుందనే ప్రచారం జరిగినా కూడా ఇప్పుడు మాత్రం ఎవరూ ఊహించని విధంగా గోపీచంద్ వైపు అడుగేస్తున్నాడు ఈ దర్శకుడు. గోపీచంద్‌తో సినిమానా అంటూ అంతా షాక్ అవుతున్నారు కానీ నిజంగానే మారుతి మాత్రం తాను రాసుకున్న కథ ఆ హీరోకే సరిపోతుందని భావిస్తున్నాడు. అందుకే ఈ హీరో వైపు చూస్తున్నాడు మారుతి. త్వరలోనే ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు ప్రకటిస్తానని చెప్పాడు మారుతి. మరి చూడాలిక.. మారుతి, గోపీచంద్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో..?
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Gopichand, Maruthi, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు