పక్కా కమర్షియల్ (Pakka Commersial) దర్శకుడు మారుతి (Maruthi), అల్లు అర్జున్ (Allu Arjun)తో సినిమా చేయబోతున్నట్లు గతంలో చాలాసార్లు కొన్ని కథనాలు అయితే వచ్చాయి. నిజానికి బన్నీ కూడా ఈ దర్శకుడితో సినిమా చేయాలని చాలాసార్లు చర్చలు జరిపాడు. కొన్నిసార్లు అయితే గీత ఆర్ట్స్ కూడా మారుతికి అడ్వాన్స్ ఇచ్చి మరి ఒక పవర్ఫుల్ కథను రెడీ చేయమని వివరణ ఇచ్చింది. ఇక అందుకు తగ్గట్టుగానే మారుతి మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథను కూడా సిద్ధం చేసి ఉంచాడు. కానీ బన్నీ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వలన మారుతి సినిమాను తెరపైకి తీసుకురడానికి సమయం కుదరలేదట.
కమర్షియల్ పాయింట్స్ తో మంచి ఎంటర్టైన్మెంట్స్ ను అందించే మారుతి ఇటీవల పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గోపీచంద్ హీరోగా రాశి ఖన్నా కథానాయక నటించిన ఈ సినిమా పెద్దగా పాజిటివ్ టాక్ అయితే ఏమీ అందుకోలేదు. కలెక్షన్స్ కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి. వీకెండ్స్ పుంజుకుంటే గాని సినిమా ప్రాఫిట్ జోన్లోకి వచ్చే అవకాశం అయితే లేదు. అయితే రీసెంట్ గా ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో మారుతి అల్లు అర్జున్ తో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు ఒక వివరణ అయితే ఇచ్చాడు.
గతంలోనే మా ఇద్దరి కాంబినేషన్లో ఒక కథపై చర్చ కూడా జరిగిందని ఫస్టాఫ్ కు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం రెడీ చేశానని మారుతి అన్నాడు. అలాగే ఆ కథ బన్నీకి చాలా నచ్చడంతో సినిమా చేద్దామని కూడా అన్నాడని ఇక నేను సెకండ్ హాఫ్ రెడీ చేసే సమయానికి మళ్ళీ అతను వేరే ప్రాజెక్టుతో బిజీ కావడం వలన అలా వాయిదా పడుతూ వస్తోందని కూడా మారుతి వివరణ ఇచ్చారు. ఇక తప్పకుండా అల్లు అర్జున్ తో మాత్రం తాను ఒక సినిమా చేస్తానని ఇకనుంచి చిన్న సినిమాలు కంటే పెద్ద హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తానని అన్నాడు.
అలాగే ప్రభాస్ తో కూడా మారుతికి ఒక కమిట్మెంట్ ఉన్న విషయం తెలిసిందే. వీరి కలయికలో సినిమా వస్తుంది అని ఈ ఏడాది మొదటి నుంచి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. పక్కా కమర్షియల్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో ప్రభాస్ ప్రాజెక్టుపై కూడా మారుతి ఒక చిన్న వివరణ అయితే ఇచ్చాడు. కేవలం చేద్దామని ఒక ఆలోచన ఉంది అని ఆ విషయాలపై ఇప్పుడే స్పందించడం అంత కరెక్ట్ కాదు అని త్వరలోనే అన్ని వివరంగా తెలుపుతానని కూడా మారుతి అన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Maruthi, Tollywood