అక్షయ్ కుమార్‌కు షాక్ ఇచ్చిన లారెన్స్..

రాఘవ లారెన్స్ మొదట డాన్స్ మాస్టర్‌గా పరిచయమైన..ఆ తర్వాత స్వయం క‌ృషితో నటుడిగాను అటూ దర్శకుడిగాను మంచి పేరు తెచ్చుకున్నాడు. అందులో భాగంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి.

news18-telugu
Updated: May 19, 2019, 12:08 PM IST
అక్షయ్ కుమార్‌కు షాక్ ఇచ్చిన లారెన్స్..
రాఘవ లారెన్స్‌తో నటుడు అక్షయ్ కుమార్
  • Share this:
రాఘవ లారెన్స్ మొదట డాన్స్ మాస్టర్‌గా పరిచయమైన..ఆ తర్వాత తన స్వయం క‌ృషితో నటుడిగాను అటూ దర్శకుడిగాను మంచి పేరు తెచ్చుకున్నాడు. అందులో భాగంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. వాటిలో ముఖ్యంగా 'ముని' సిరీస్‌లో వచ్చిన సినిమాలు తెలుగు తమిళ భాషాల్లో మంచి కలెక్షన్స్‌‌తో అదరగొట్టాయి. ఆ కోవలోనిదే.. ఇటీవల వచ్చిన 'కాంచన' ఇటు తెలుగు అటు తమిళ భాషాల్లో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా దక్షిణాదిన సెన్సేషనల్ హిట్ సాధించింది. అయితే ఇదే సినిమాను లారెన్స్ హిందీలో కూడా తీస్తున్నట్లు, సినిమా పేరును 'లక్ష్మీ బాంబ్‌' అని ప్రకటించాడు. అంతే కాకుండా హిందీ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా, కైరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించి షూటింగ్ కూడా రీసెంట్‌గా షురూ అయ్యింది. శనివారం 'లక్ష్మీ బాంబ్‌'కు సంబందించి ఓ ఫస్ట్ లుక్‌ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. అయితే విడుదలైన ఈ ఫస్ట్‌లుక్.. ఓ పెద్ద వివాదానికి దారి తీసింది. దర్శకుడు లారెన్స్‌ను అడగకుండా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారట చిత్రబృందం.ఇదే విషయంపై లారెన్స్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆయన మాటల్లో.. 'తమిళంలో ఓ నానుడి ఉంది. గౌరవం లేని ఇంట్లో అడుగు పెట్టకూడదని, అంతేకాదు.. ఈ ప్రపంచంలో పేరు, ప్రతిష్టల, డబ్బు కంటే వ్యక్తిగత గౌరవం చాలా ముఖ్యమైంది. కనుక 'లక్ష్మీ బాంబ్' ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేస్తున్నాను. అయితే దీనికి ఒక్క కారణమని చెప్పలేను.  ఓ ఉదాహరణకు..'నా అనుమతి లేకుండా నాతో చర్చించకుండా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ విషయం కూడా నాకు మూడో వ్యక్తి ద్వారా తెలిసింది. ఈ సినిమాకు దర్శకుడిగా..ఈ విషయం ఎంత బాధాకరంగా ఉంటుందో నాకు తెలుసు. విడుదల చేసిన పోస్టర్‌ కూడా నాకు నచ్చలేదు. ఇలాంటి ఘటన ఏ దర్శకుడికీ జరగకూడదు. ఈ పరిస్థితిల్లో ఈ సినిమాకు దర్శకుడిగా నేను కొనసాగలేను. అయితే నాకు అక్షయ్‌ కుమార్ సార్‌ అంటే ఎంతో అభిమానం. అందుకే స్క్రిప్ట్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకోవడం లేదు. నేను ఈ సినిమా చేయట్లేదు. కాబట్టి వారికి నచ్చిన దర్శకుడిని తీసుకోవచ్చు. ఈ నిర్ణయం గురించి అక్షయ్‌ను కలిసి త్వరలోనే చెప్పేస్తా. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు దర్శకుడు రాఘవ లారెన్స్.

First published: May 19, 2019, 11:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading