హోమ్ /వార్తలు /సినిమా /

Krishna Vamsi: తెలంగాణ సాయుధ పోరాటంపై .. భారీ బడ్జెట్‌తో కృష్ణ వంశీ వెబ్ సిరీస్

Krishna Vamsi: తెలంగాణ సాయుధ పోరాటంపై .. భారీ బడ్జెట్‌తో కృష్ణ వంశీ వెబ్ సిరీస్

అయితే ఈ వెబ్ సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 50 ఎపిసోడ్స్ తో ఐదు సీజన్లలో ఈ సిరీస్ తెరకెక్కనుందని సమాచారం.

అయితే ఈ వెబ్ సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 50 ఎపిసోడ్స్ తో ఐదు సీజన్లలో ఈ సిరీస్ తెరకెక్కనుందని సమాచారం.

అయితే ఈ వెబ్ సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 50 ఎపిసోడ్స్ తో ఐదు సీజన్లలో ఈ సిరీస్ తెరకెక్కనుందని సమాచారం.

  ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. అనేకమంది అమరులు అయ్యాకే.. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాల్లో తెలంగాణ సాయుధ పోరాటం ఒకటి. ఈ పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్‌ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్‌ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్‌ జాహీల పాలనలో ఉంది. తెలంగాణ సాయుధ పోరాటానికి మూలాలు నిజాం నిరంకుశ పాలనలో ఉందని చారిత్రికులు పేర్కొన్నారు. హైదరాబాద్ రాజ్యంలో పాలకుడు ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ స్థాయి నుంచి గ్రామాల్లోని దొరల వరకూ సాగిన అణచివేత విధానాలకు నిరసనగా ఈ పోరాటం మొలకెత్తింది. వెట్టి చాకిరి, భావవ్యక్తీకరణపై తీవ్ర ఆంక్షలు, మాతృభాషలపై అణచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు వంటి ఎన్నో పరిణామాలు నేపథ్యంగా నిలిచాయి.

  అయితే తాజాగా ఈ సాయుధ పోరాటంపై వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. కృష్ణ వంశీ తన చేతిలో ఉన్న రెండు ప్రాజెక్టుల తర్వాత ఓటీటీలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం కృష్ణవంశీ దేశ చరిత్రలోనే భారీ వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో త్వరలోనే ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నట్టు ఆయన ఈ మధ్య ప్రకటించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తారని వెల్లడించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. దీనిపై ఇప్పటిదాకా పలు సినిమాలు వచ్చాయి. అయితే, సుదీర్ఘ కాలం జరిగిన సాయుధ పోరాటంలో కొన్ని ఘట్టాలనే సినిమాల్లో చూపించారు.

  ఇప్పుడు వెబ్ సిరీస్‌ రూపంలో ఈ పోరాటంలోని అన్ని అంశాలను విడమరచి చెప్పే అవకాశం కృష్ణవంశీకి లభించనుంది. దీనిపై ఆయన ఇప్పటికే పరిశోధన ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 50 ఎపిసోడ్స్ తో ఐదు సీజన్లలో ఈ సిరీస్ తెరకెక్కనుందని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి చేసే ఈ వెబ్ సిరీస్ గురించి తొందర్లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ వెబ్ సిరీస్ తెలుగులోనే కాకుండా భారత సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ ప్రాజెక్టుగా మారనుంది.

  టాలీవుడ్ లో సృజనాత్మక దర్శకుడిగా కృష్ణవంశీకి మంచి పేరుంది. తొలి చిత్రం గులాబీ మొదలు నిన్నే పెళ్లాడతా, సింధూరం, మురారి, ఖడ్గం, చందమామ వరకు గుర్తిండిపోయే సినిమాలు తీశారు. కానీ, 2007లో వచ్చిన చందమామ తర్వాత ఆయన మరో విజయం అందుకోలేకపోయారు. దశాబ్దానికిపైగా ఫ్లాప్ లో ఉన్న కృష్ణవంశీ ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో ‘రంగమార్తాండ’ టైటిల్ తో కొత్త చిత్రం చేస్తున్నారు. దీనిపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రం తర్వాత ‘అన్నం’ అనే మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఇందులో రైతన్నల ఆకలి పోరాటాన్ని ఆవిష్కరించబోతున్నారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Krishna vamsi, Telangana, Tollywood, Webseries

  ఉత్తమ కథలు