హోమ్ /వార్తలు /సినిమా /

NTR Biopic : కథానాయకుడుతో ఎన్టీఆర్ జీవితంలోని భిన్న కోణాల్ని ఆవిష్కరించిన క్రిష్

NTR Biopic : కథానాయకుడుతో ఎన్టీఆర్ జీవితంలోని భిన్న కోణాల్ని ఆవిష్కరించిన క్రిష్

కథానయకుడిలో ఓ దృశ్యం (ట్విట్టర్)

కథానయకుడిలో ఓ దృశ్యం (ట్విట్టర్)

ఎన్నో అంచనాలతో రిలీజైంది నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం "కథానాయకుడు". సహజంగా ఏ సినిమా అయినా రిలీజైతే బాగుందా, పోయిందా అన్న ప్రశ్నలే వస్తుంటాయి. ఈ సినిమాని ఆ కోణంలో చూడలేమంటున్నారు ఫ్యాన్స్. ఎందుకో వారి అభిప్రాయాల ద్వారా తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

నందమూరి తారక రామారావు తనయుడిగా... తెలుగు చిత్ర సీమలో ఎన్నో వైవిధ్య పాత్రల్ని పోషించి, మెప్పించిన బాలకృష్ణ... ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించడం ద్వారా భారీ సాహసమే చేశారంటున్నారు ఫ్యాన్స్. ఓ మహానటుడి జీవితాన్ని తెరకెక్కించే క్రమంలో... ఎన్టీఆర్ చేసిన 60కి పైగా పాత్రల్ని ఒక్క బాలకృష్ణలోనే చూపించడం అన్నింటిలోనూ ఎన్టీఆర్‌ని ఆవిష్కరింపజేసేందుకు దర్శకుడు క్రిష్, మేకప్ ఆర్టిస్టులు పడిన కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా అందరూ ఊహించినట్లు ఎన్టీఆర్ జీవితాన్ని ఎన్టీఆర్ కోణంలో కాకుండా... ఆయన సతీమణి బసవతారకం ఆలోచనలను ప్రతిబింబిస్తూ... చిత్రీకరించడం అభిమానులనే కాదు... తెలుగు ప్రజలను ఆకట్టుకుంటోందన్న టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది.

తొలినాళ్లలో ఎన్టీఆర్ జీవితం, సినిమాల్లోకి ఎంట్రీ, ఆ తర్వాత రాజకీయాలవైపు మళ్లడానికి కారణమైన పరిస్థితులు అన్నింటినీ క్రిష్ ఆవిష్కరిచిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ వెన్నంటి నడిచిన బసవతారకం వివిధ సందర్భాల్లో ఆయనకు ఎలాంటి సేవలు అందించారో, ఎంత చేదోడువాదోడుగా నిలిచారో డైరెక్టర్ క్రిష్ చక్కగా చిత్రీకరించారన్న రెస్పాన్స్ వస్తోంది. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ వందశాతం ఒదిగిపోయారనీ, ఒకరకంగా చెప్పాలంటే... ఫస్ట్ పార్టులో బాలకృష్ణ కంటే... విద్యా బాలన్‌కే ఎక్కువ మార్కులు వేస్తున్నారు చాలా మంది అభిమానులు.

సెంటిమెంట్, ఎమోషనల్ టచ్ ఇస్తూనే... అలనాటి చారిత్రక అంశాలు, సినీ జగత్తులో పరిస్థితులను క్రిష్ అత్యంత వివరంగా చూపించారన్ని చెబుతున్నారు ఫ్యాన్స్. దృశ్యాలకు తోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకుల్ని కథలో లీనమయ్యేలా చేసిందన్న ప్రశంసలు వస్తున్నాయి. అక్కడక్కడా కొన్ని సీన్లు లెంగ్తీగా, సాగదీసినట్లు ఉన్నా... బయోపిక్ కావడం వల్ల, వాస్తవాల్ని చూపించడం వల్ల ఆ పరిస్థితి ఏర్పడి ఉండొచ్చన్న అభిప్రాయానికి వస్తున్నారు. చివరి 20 నిమిషాల్లో కథ నడిపించిన తీరు, భావోద్వేగ దృశ్యాలు ప్రేక్షకుణ్ని సంతృప్తిగా థియేటర్ నుంచీ బయటకు పంపిస్తున్నాయని అంటున్నారు అభిమానులు.

View this post on Instagram

Simham at Bramarambha 💥 💥 #JaiBalayya


A post shared by Nandamuri Balakrishna™ (@balayyababu_official) onఓవరాల్‌గా కథానాయకుడి వెనకుండి ముందుకు నడిపించిన బసవతారకం యాంగిల్‌లో మొదటి పార్టును తీర్చిదిద్దిన క్రిష్... రెండో పార్టును మాత్రం పూర్తిగా రాజకీయాలు, ఎత్తులకు పై ఎత్తులతో సిద్ధం చేస్తున్నారని తెలిసింది. మొత్తానికి సంక్రాంతి సమయంలో... కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా మంచి మార్కులు సాధించింది కథానాయకుడు.

ఇవి కూడా చదవండి:


#NTR Biopic: ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ప్రివ్యూ టాక్..


ఎన్టీఆర్‌కు సావిత్రి స‌వాల్.. ‘మ‌హాన‌టి’ని ‘క‌థానాయ‌కుడు’ మరిపించాడా ?


టాలీవుడ్‌లో బయోపిక్ ట్రెండ్...‘ఎన్టీఆర్’ మూవీతో పెరిగిన క్రేజ్

Published by:Krishna Kumar N
First published:

Tags: Bala Krishna, NTR Biopic, Telugu Cinema, Telugu Movie

ఉత్తమ కథలు