క్రిష్ తన భార్య నుండి విడాకులు తీసుకుంటున్నారా?

news18
Updated: June 6, 2018, 2:03 PM IST
క్రిష్ తన భార్య నుండి విడాకులు తీసుకుంటున్నారా?
  • News18
  • Last Updated: June 6, 2018, 2:03 PM IST
  • Share this:
టాలీవుడ్ లో ఉదయం నుండి  ఓ వార్త సంచలంగా మారింది  డైరెక్టర్ జాగర్లమూటి రాధాకృష్ణ ( క్రిష్) తన భార్య  డాక్టర్ రమ్య  నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారట . క్రిష్ – రమ్య పరస్పర అంగీకారంతో.. ఇద్దరూ  విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు  వార్తలు  వస్తున్నాయి

ఈ మేరకు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.  చాలా మంది ప్రముఖు లు కూడా క్రిష్ ను ఇదే అంశంపై ఫోన్ చేసి అడిగినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో  డైరెక్టర్ క్రిష్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించి.. ప్రచారానికి తెరదించాలని డిసైడ్ అయ్యారు.

బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి  సినిమా  టైమ్ లో డాక్టర్ రమ్యను వివాహం చేసుకున్నారు క్రిష్.  ఆ మూవీ హిట్ తర్వాత.. హిందీలో కంగనారనౌత్ తో మణికర్ణిక ప్రాజెక్ట్ చేపట్టాడు. ఆరు నెలలుగా అదే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టాడు. కుటుంబంతో కంటే.. సినిమాల్లోనే బిజీ అయిపోవటంతో భార్య రమ్యతో విభేదాలు  వచ్చినట్లు సమాచారం.కాగా, క్రిష్ విడాకులు తీసుకోవడానికి ఓ నటితో డేటింగ్ చేయడమే కారణమనే రూమర్ ప్రచారంలో ఉంది. క్రిష్ డైరెక్షన్లోనే ఆ హీరోయిన్ ఓ హిట్ చిత్రంలో నటించిందని చెబుతున్నారు. క్రిష్ పెళ్లయ్యాక కూడా వీరి అనుబంధం కొనసాగుతోందని, అందుకే రమ్య విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
Published by: Sunil Kumar Jammula
First published: June 1, 2018, 11:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading