Koratala Siva: దర్శకుడు కొరటాల శివ సంచలన నిర్ణయం.. ఎన్టీఆర్ మూవీకి ముందే ఫ్యాన్స్‌కు షాక్..

దర్శకుడు కొరటాల శివ (Twitter/Photo)

Koratala Siva: దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది కూడా  ఎన్టీఆర్ మూవీకి ముందే ఆ నిర్ణయం తీసుకొని ఫ్యాన్స్‌కు పెద్ద షాకే ఇచ్చారు. వివరాల్లోకి  వెళితే..

  • Share this:
    Koratala Siva: దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది కూడా  ఎన్టీఆర్ మూవీకి ముందే ఆ నిర్ణయం తీసుకొని ఫ్యాన్స్‌కు పెద్ద షాకే ఇచ్చారు. వివరాల్లోకి  వెళితే.. తెలుగు చిత్ర పరిశ్రమలో పోసాని కృష్ణ మురళి దగ్గర మాటల రచయతగా ప్రస్థానం మొదలు పెట్టారు. ఆ తర్వాత చంద్రశేఖర్ యేలేటి, బోయపాటి శ్రీను దగ్గర మాటల రచయతగా, అసిస్టెంట్‌గా పనిచేసారు. ఆ తర్వాత ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘మిర్చి’ (Mirchi)సినిమాతో డైరెక్టర్‌గా మెగా ఫోన్ పట్టుకున్నారు.  ‘మిర్చి’ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత సూపర్ స్టార్  మహేష్ బాబు (Mahesh Babu)తో ‘శ్రీమంతుడు’ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు.

    ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (NTR)తో ‘జనతా గ్యారేజ్’ సినిమాతో హాట్రిక్ అందుకున్నారు. ఆ తర్వాత మరోసారి మహేష్ బాబుతో పొలిటికల్ థ్రిల్లర్ ‘భరత్ అను నేను’ సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబును తొలిసారి స్టైలిష్ ముఖ్యమంత్రి పాత్రలో చూపించారు. ఆ తర్వాత ఇపుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan)లతో పూర్తి స్థాయిలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఈ సినిమా కంప్లీట్ కానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ 30వ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంది. మొత్తంగా వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న కొరటాల శివ తాజాగా సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు.



    ఈ మధ్య కాలంలో హీరోలు, దర్శకులు చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమకు సంబంధించిన విషయాలను అభిమానులకు నేరుగా తెలియజేస్తున్నారు. ఈ కోవలో కొరటాల శివ .. సోసల్ మీడియాను బాయ్‌కాట్ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈయన సోషల్ మీడియాకు దూరం కావాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయం ఇపుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: