K Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ఈ రోజు వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..

కే.రాఘవేంద్రరావు (File/Photo)

K Raghavendra Rao | తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన దర్శకుడు కే.రాఘవేంద్ర రావు. తెలుగు మూవీని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు. అందుకే తనకు అచ్చొచ్చిన ఈ రోజున తన కొత్త సినిమాకు సంబంధించిన పాటను విడుదల చేసారు.

 • Share this:
  K Raghavendra Rao:  దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో  ఆయన స్టైల్ డిఫరెంట్. ఆప్రోచ్ డిఫరెంట్ .. మేకింగ్లో  వెరైటీ. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ఆయన రూటే సెపరేటు. ఇక హీరోయిన్ ను గ్లామరస్‌గా చూపించడంలో కే.రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా... కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ అతను. కేవలం కమర్షియల్ చిత్రాలే కాదు.. భక్తి చిత్రాలను తీసి ప్రేక్షకులను పరవశింపజేసారు. ఇటువంటి ట్రాక్ రికార్డు ఉన్న రాఘవేంద్రరావుకు  ఏప్రిల్ 28న వెరీ వెరీ స్పెషల్. అంతేకాదు ఈ డేట్ ఆయన జీవితంలో మరుపు రాని రోజుగా మిగిలిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 28న సరిగ్గా 44 ఏళ్ల క్రితం  ఆయన నందమూరి తారక రామారావుతో తొలిసారి ‘అడవి రాముడు’ చిత్రాన్ని తెరకెక్కించారు. అంతేకాదు అన్నగారితో ఆయన సినీ ప్రస్థానం అడవి రాముడు సినిమాతో కొత్త పుంతలు తొక్కించింది.

  తెలుగు సినీ ప్రపంచంలో ఎన్నో రికార్డులు తిరగరాసి, కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టింది అడవి రాముడు మూవీ. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సినీ చరిత్రలో  కొత్త హిస్టరీ క్రియేట్ చేసిన రోజు ఏప్రిల్ 28.  అడవి రాముడు సినిమాకు ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ఫస్ట్ మూవీ. అలాగే జయప్రద, జయసుధతో ఎన్టీఆర్‌కు ఇదే ఫస్ట్ మూవీ. ఒక జానపద మూవీని సోషలైజ్ చేసి విజయం సాధించిన మూవీ. ఈ చిత్రం అప్పట్లో 4 కేంద్రాల్లో ఒక యేడాది నడిచింది. 8 సెంటర్లలో 200 రోజులు. 35 సెంటర్లలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. ఇక నెల్లూరు కనక మహల్ థియేటర్‌లో ఈ చిత్రం రోజూ 5 షోలతో 100 రోజులు ప్రదర్శింపబడటం విశేషం. ఈ చిత్రానికి వేటూరి అందించిన సాహిత్యం, కేవీ మహదేవన్ సంగీతం.. ఎస్పీ బాలు,సుశీల, గాత్రం ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ హీరోగా ఇదే టైటిల్‌తో అడవి రాముడు సినిమా రావడం విశేషం.

  ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ టైటిల్‌తో ప్రభాస్ మూవీ (Twitter/Photo)


  మరోవైపు రాఘవేంద్రరావుకు మెమరబుల్ డేట్ అయిన ఏప్రిల్ 28న ఆయన సమర్ఫణలో ఆయన మేనల్లుడు, అల్లుడు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని.. రాఘవేంద్రరావు శిష్యుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘బాహుబలి’ రెండు పార్టులను తెరకెక్కించారు. ఇందులో బాహుబలి రెండో పార్ట్ ఏప్రిల్ 28న విడుదలైంది. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే కాదు.. భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవిరాముడు’ ఆహా అనిపిస్తే.. ఆయన సమర్పణలో తెరకెక్కిన ‘బాహుబలి 2’ మాత్రం సాహో అనిపించింది.

  ప్రభాస్ అనుష్క ఫైల్ ఫోటోస్ (Prabhas Anushka)
  బాహుబలి (Prabhas Anushka)


  రెండు పండగలను ఒకేరోజు అందించింది రోజు ఏప్రిల్ 28. ఇపుడు అదే రోజున ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో  గౌరీ రోనంకి దర్శకత్వంలో  హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ’పెళ్లి సందడి’ సినిమాకు సంబంధించిన ‘ప్రేమంటే ఏంటి’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. గతంలో వీళ్లిద్దరు కలయికలో శ్రీకాంత్ హీరోగా ‘పెళ్లి సందడి’ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.


  ఇపుడు 25 యేళ్ల తర్వాత శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా .. అదే ‘పెళ్లి సందడి’ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు  ఏప్రిల్ 28న రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ, కృష్ణంరాజు హీరోలుగా నటించిన ‘అడవి సింహాలు’ సినిమా కూడా ఇదే రోజు విడుదలైంది.  ఈ చిత్రానికి సి.అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరించారు.  అంతేకాదు అశ్వనీదత్, వైజయంతి కాంబినేసన్‌లో ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం. మొత్తంగా తనకు అచ్చొచ్చని ఏప్రిల్ 28న తేదిన తన కొత్త సినిమాకు సంబంధించిన పాటను విడుదలకు ఎంచుకోవడం విశేషం.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: