DIRECTOR K RAGHAVENDRA RAO EXPERIENCE WITH CHIRANJEEVI GHARANA MOGUDU SHOOTING TA
చిరంజీవి పై రాఘవేంద్రరావు ఆసక్తికర కామెంట్స్.. ఇంతకీ ఏమన్నాడంటే..
ఘరానా మొగుడు సినిమా షూటింగ్లో చిరుకు రాఘవేంద్రరావు సూచనలు (Twitter/Photo)
చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన ఘరానా మొగుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి రాఘవేంద్రరావు తన జ్జాపకాలను పంచుకున్నారు. దానికి చిరంజీవి ఆసక్తికర రిప్లై ఇచ్చారు.
టాలీవుడ్లో చిరంజీవి, కే.రాఘవేంద్రరావులది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో 14 సినిమాలు తెరకెక్కాయి. అందులో 12 సినిమాల్లో చిరంజీవి హీరోగా నటించారు. రెండు చిత్రాల్లో మాత్రం సెకండ్ హీరో పాత్రలో నటించాడు. మొత్తంగా వీళ్లిద్దరి కలయకలో వచ్చిన చిత్రాలు తెలుగు ఇండస్ట్రీలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసాయి. నిన్నటి నిన్న చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన ఘరానా మొగుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి రాఘవేంద్రరావు తన జ్జాపకాలను పంచుకున్నారు. కాలం త్వరగా గడిచిపోతుంది. ఐతే నా బాబాయితో కలిసి ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్న రోజులను ఇప్పటికీ మరిచిపోలేనన్నారు. రాఘవేంద్రరావు.. చిరంజీవిని ముద్డుగా బాబాయి అని పిలుస్తుంటారు. ఇది మా ఇధ్దరి కాంబినేషన్లో స్పెషల్ మూవీ. ఈ సినిమా విడుదలై 28 ఏళ్లు పూర్తయ్యాయి. నిర్మాత దేవీవర ప్రసాద్ గారికి, కీరవాణికి చిత్ర బృందానికి రాఘవేంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు.
Time flies but memories of shooting this film with my Baabai are still fresh in my mind... @KChiruTweets...
A Mega special film. A milestone film. It’s been 28 years since #GharanaMogudu's release...
Thanks to my producer late Devi Varaprasad and the entire team. @mmkeeravaanipic.twitter.com/kgyWsrMsTc
— Raghavendra Rao K (@Ragavendraraoba) April 9, 2020
ఇక దర్శకేంద్రుడు ట్వీట్‌కు చిరంజీవి స్పందించారు. ఈ ఘనత మీతో పనిచేసిన ప్రతీ రోజు నాకో మంచి జ్ఞాపకం అన్నారు. నటీనటులను పువ్వుల్లో, ఒక్కోసారి పళ్లల్లో పెట్టి చూసుకొని మంచి ఫలితాలను రాబట్టుకునే ఘరానా దర్శకుడు మీరు. ఈ సినిమా విజయంలో కీరవాణి, దేవీ వరప్రసాద్ ఈ విజయానికి అసలు కారకులు అంటూ చిరంజీవి రిప్లై ఇచ్చారు.
ఈ magic ఘనత మీది Sir @Ragavendraraoba ఈ చిత్రం సృష్టించిన records కంటే, మీతో పనిచేసిన ప్రతి రోజు ఓ మంచి memory.artistes ని పువ్వుల్లో (ఒకోసారి పళ్లలో ) పెట్టి చూసుకుంటూ, best output రాబట్టుకున్న ఘరానా దర్శకుడు మీరు,కీరవాణి గారు,నిర్మాత దేవీవరప్రసాద్ గారు ఈ విజయానికి మూలస్థంబాలు https://t.co/OcXsDces9mpic.twitter.com/DV01OofQ8X
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 9, 2020
ఇక కీరవాణి, రాఘవేంద్రరావు, చిరంజీవి కాంబినేషన్లో ఇది ఫస్ట్ మూవీ. ఇక నిర్మాత దేవీ వరస్రసాద్, చిరంజీవి, రాఘవేంద్రరావు గతంలో కొండవీటి దొంగ, మంచి దొంగ సినిమాలు చేసారు.ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన హాట్రిక్ మూవీ ఘరానా మొగుడు. మొత్తంగా రాఘవేంద్రరావు టేకింగ్.. చిరంజీవి మెగా ఇమేజ్.. కామెడీ టైమింగ్.. నగ్మా అందాలు.. వాణి విశ్వనాథ్ సొగసులు అన్నీ సినిమాకు ప్లస్ అయ్యాయి.