తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన దర్శకుడు. తెలుగు మూవీని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు. ఆయన స్టైల్ డిఫరెంట్.. ఆప్రోచ్ డిఫరెంట్ .. మేకింగ్‌లో వెరైటీ. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ఆయన రూటే సెపరేటు. ఇక హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో కే.రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా...కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్. భక్తి చిత్రాలను తీసి ప్రేక్షకులను పరవశింపజేసాడు. ఆయనే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. టాలీవుడ్లో ఆయన అడుగుపెట్టి 50 ఏళ్లకు పైనే అవుతోంది. కానీ ఈ శనివారంతో దర్శకుడిగా ఆయన 45 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. సరిగ్గా 45 ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాబు’ చిత్రం ఈ రోజే విడుదలైంది. శోభన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో వాణిశ్రీ, లక్ష్మీ హీరోయిన్స్‌గా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకున్న కే.రాఘవేంద్రరావు 1942 మే 23వ తేదిన కృష్ణా జిల్లా , కంకిపాడు మండలం, కోలవెన్ను గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి కె.యస్. ప్రకాష్ రావు కూడ ాపెద్ద డైరెక్టర్. ఆ తర్వాత ఆయన కమలకర కామేశ్వరరావు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసారు.

దర్శకుడు కే.రాఘవేంద్రావు ఫస్ట్ మూవీ బాబు (Twitter/Photo)
హీరోయిన్ ను తెరపై ఎంత అందంగా చూపించాలో...ఏ ఏ యాంగిల్స్ లో చూపించాలో ఆయనకు తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదు. దర్శకేంద్రుడి కెమెరాకు ప్రతి భామ ఒక ముద్దబంతి పూవ్వే. పదహారేళ్ల వయసు కన్నెపిల్ల భావాలను సిరిమల్లె పువ్వల్లే చాలా చక్కగా ఆవిష్కరించాడు. కథానాయికను శృంగారదేవతగా చూపించడంలో సక్సెస్ సాధించాడు కె.రాఘవేంద్రరావు.

పదహారేళ్ల వయసు చిత్రంలో శ్రీదేవి (Twitter/Photo)
హీరోయిన్ ను గ్లామర్ డాల్ గా చూపించడమే కాదు. మహిళా ప్రధానమైన చిత్రాలు రూపొందించి సక్సెస్ సాధించాడు. కెరీర్ కొత్తలో లేడి ఓరియంటెడ్ సబ్జెక్ట్ లతో చేసిన ఆమెకథ, కల్పన, జ్యోతి చిత్రాలు దర్శకుడిగా కె.రాఘవేంద్రరావు ప్రతిభను చాటాయి. కమర్షియల్, లేడి ఓరియంటెడ్ సబ్జెక్ట్ లే కాదు. సందేశాత్మక సినిమాలు సైతం తీయగలనని ‘త్రిశూలం’ వంటి సినిమాలతో నిరూపించుకున్నాడు రాఘవేంద్రుడు. కృష్ణంరాజు హీరోగా వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ గానే కాకుండా మ్యూజికల్ గా మంచి హిట్ సాధించింది. ఈ విధంగా వెరైటీ కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడంలో...తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.

త్రిశూలం మూవీ (Youtube/Credit)
1977లో ఎన్టీఆర్ తో చేసిన ‘అడవిరాముడు’ చిత్రం సూపర్ హిట్టవడంతో.. దర్శకుడిగా కె.రాఘవేంద్రరావు పేరు మారుమ్రోగింది. నటుడిగా ఎన్టీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది పలికేలా చేసింది ఈ చిత్రం.దర్శకేంద్రుడు ఎన్టీఆర్ తో చేసిన ఎన్నో చిత్రాలు కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించాయి. ఇవన్నీ రామారావు హీరోగా మాంచి ఊపుమీద ఉన్న రోజుల్లో నిర్మించినవి కావడం విశేషం.

ఎన్టీఆర్, కే.రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన అడవి రాముడు (Twitter/Photo)
1993లో నటరత్నఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాను తన దర్శకత్వ ప్రతిభతో సూపర్ హిట్ గా నిలబెట్టాడు రాఘవేంద్రరావు. ఈ విధంగా ఎన్టీఆర్ లాస్ట్ సోషల్ మూవీని సక్సెస్ చేసిన ఘనత దర్శకేంద్రుడుకే దక్కుతుంది.

మేజర్ చంద్రకాంత్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్, మోహన్ బాబుతో దర్శకేంద్రుడు (Twitter/Photo)
ఎన్టీఆర్ తర్వాత హీరో కృష్ణకు తన డైరెక్షన్లో ఎన్నో సూపర్ హిట్ లను అందించాడు రాఘవేంద్రుడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఊరికి మొనగాడు, ఘరానా దొంగ, అగ్నిపర్వతం చిత్రాలు కమర్షియల్ గా మంచి విజయాలు సాధించాయి. అగ్ని పర్వతం మూవీ హీరోగా కృష్ణ ఇమేజ్ ను కొత్త పుంతలు తొక్కించింది. ఈ చిత్రంలో అగ్గిపెట్టె ఉందా....? డైలాగ్ ఎంతో పాపులర్ అయ్యింది. ఈ విధంగా తన సినిమాలతో హీరోయిజాన్ని ఎక్స్ పోజ్ చేయడంలో కె.ఆర్ సిద్ధహస్తుడనిపించుకున్నాడు.

అగ్ని పర్వతంలో కృష్ణ (Twitter/Photo)
కమర్షియల్ ఫార్మాట్ లో తీసిన సోషియో ఫాంటసీ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. దర్శకుడిగా కె.రాఘవేంద్రరావు ను మరోమెట్టు పైకెక్కించింది. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ఈచిత్రం ఆద్యంతం ఒక దృశ్య కావ్యంలా మలిచాడు. అతిలోకసుందరి గా శ్రీదేవిని చాలా గ్లామరస్ గా చూపించడంతో పాటు..హీరోగా మెగాస్టార్‌ను రేంజ్ ను పెంచడంలో దర్శకుడిగా రాఘవేంద్ర రావు ప్రతిభ దాగుంది.

జగదేవవీరుడు అతిలోకసుందరి (Facebook/Photo)
దర్శకేంద్రుని ప్రతిభ కేవలం తెలుగుకే పరిమిత కాలేదు.. హిందీ చిత్ర సీమలో తన దర్శకత్వంలోవచ్చిన ఎన్నో చిత్రాలను రీమేక్ చేసారు. ిక తన సినిమాల్లో కమర్షియల్ హంగులకు ప్రాధాన్యం ఇస్తూనే ...సంగీతానికి పెద్ద పీట వేయడంలో రాఘవేంద్రుడిది అందెవేసిన చేయి. ఈయన రూపొందించే మూవీల్లో కథ, కథనంతో పాటు మ్యూజిక్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. అలాగే పాటల చిత్రీకరణలో.. హీరోయిన్ ను గ్లామర్ గా చూపించడంలో దర్శకేంద్రుడి శైలి విభిన్నమైనది. అందుకనే ఆయన మూవీని కేవలం పాటల కోసం మాత్రమే చూసే ప్రేక్షకులు నేటికి ఉన్నారు.

కే.రాఘవేంద్రరావు (Facebook/Photo)
తెలుగు తెరకు కొత్త వాళ్లను పరిచయం చేయడంలోనూ...ఐరన్ లెగ్ లను గోల్డెన్ లెగ్గులుగా మార్చడంలో దర్శకేంద్రుడి హ్యాండ్ కి తిరుగులేదు. కలియుగ పాండవులు మూవీతో వెంకటేష్..‘రాజకుమారుడు’ సినిమాతో పూర్తిస్థాయి హీరోగా ప్రిన్స్ మహేష్ బాబును..‘గంగోత్రి’తో అల్లు అర్జున్ ను వెండితెరకు పరిచయం చేసాడు. అలాగే అందాల తారలు శ్రీదేవి, విజయశాంతి, రమ్యకృష్ణ, , రంభ వంటి వారిని పాపులర్ చేసిన ఘనత రాఘవేంద్రుడికే దక్కుతుంది.

రాఘవేంద్రరావు,రమ్యకృష్ణ (ramya krishna raghavendra rao)
మాస్, కుటుంబ కథా చిత్రాలనే కాదు.. భక్తి సినిమాలను సైతం అద్భుతంగా తెరకెక్కంచగలనని ‘అన్నమయ్య’ తో నిరూపించుకున్నాడు కె.ఆర్. ఈ చిత్రం తో రాఘవేంద్రరావు తొలిసారి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్నాడు. ఉత్తమ నటుడిగా నాగార్జున నంది అవార్డు అందుకోవడంలో దర్శకేంద్రుడి ప్రతిభే కీలకం. అంతేకాదు ఈ చిత్రానికి నాగార్జున జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. సంగీత పరంగా ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. ఈ విధంగా తెలుగులో ఆధ్యాత్మిక చిత్రాలతో కమర్షియల్ హిట్స్ ఇచ్చిన ఘనుడు రాఘవేంద్రుడు.

అన్నమయ్య (Facebook/Photo)
అన్నమయ్య’ హిట్ తర్వాత చేసిన శ్రీమంజునాథ, శ్రీరామదాసు, పాండురంగడు, శిరిడిసాయి, ఓం నమో వేంకటేశాయ వంటి ఆధ్యాత్మిక చిత్రాలను నేటి తరానికి అందించండంలో కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. ఇలా అన్ని రకాల చిత్రాలను తీయడంలో సిద్ధహస్తుడని నిరూపించుకున్నారు రాఘవేంద్రరావు.