Home /News /movies /

DIRECTOR HARISH SHANKAR WARNING TO PAWAN KALYAN FANS SB

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు హరీశ్ శంకర్ వార్నింగ్

పవన్ కళ్యాణ్,హరీష్ శంకర్ సినిమాపై క్రేజీ అప్‌డేట్ (Twitter/Photo)

పవన్ కళ్యాణ్,హరీష్ శంకర్ సినిమాపై క్రేజీ అప్‌డేట్ (Twitter/Photo)

అంటే సుందరానికి ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన హడావుడిపై హరీశ్ శంకర్ కాస్త చిరాక పడ్డారు. వారికి ఓ వార్నింగ్ కూడా ఇచ్చాడు.

    పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. ఫంక్షన్ ఏదైనా.. పవన్ కళ్యాణ్ అభిమానుల సందడే వేరు. ఈవెంట్ అంత గోల గోల చేస్తారు. ఫంక్షన్, ఈవెంట్ ఎవరిది అయినా అనవసరం.. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పవర్ స్టార్ గురించి అరుస్తూ.. నానా హంగామా చేస్తారు. తాజాగా నేచురల్ స్టార్ నాని (Nani) అంటే సుందరానికి సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌‌లో పవర్ స్టార్ ఫ్యాన్స్ అల్లరి మామూలుగా లేదు. ఈ ఈవెంట్‌కు పవర్ స్టార్ (Power Star Pawan Kalyan)వస్తారని తెలిసి.. అభిమానులు సైతం భారీగా తరలివచ్చారు. ఇక ఎవరు మాట్లాడిన కూడా పవన్ కళ్యాణ్ అంటూ.. నినాదాలు చేశారు. దీంతో వారి అల్లరిని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాలేదు.

    ఇక ఈ షోకు యాంకర్‌గా వచ్చిన సుమ (Suma)సైతం.. పవన్ కళ్యాణ్ వస్తారు.. మాట్లాడతారు అంటూ.. వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇక పవర్ స్టార్‌‌తో కలిసి హరీశ్ శంకర్ (Harish Shankar)మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌‌‌‌‌లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనం చూశాం. తాజాగా మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది. దీంతో అభిమానులు కూడా దీనికి సంబంధించిన అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక అంటే సుందరానికి ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం..డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా వచ్చారు. ఇక హరీశ్ మట్లాడుతుండగా.. పవన్ ఫ్యాన్స్ అల్లరి చేశారు. దీంతో వారికి వార్నింగ్ ఇచ్చారు హరీశ్ శంకర్.



    సినిమా ఇండస్ట్రీ అంటే ఒక్క ఫ్యామిలీ కాదు.. ఇండస్ట్రీ అంతా ఒకటే ఫ్యామిలీ అని కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారన్నారు. ‘బయట సినిమా ఫంక్షన్లకు కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మీరు గనుక డిస్ట్రబ్ చేయకుండా ఫంక్షన్ సజావుగా సాగి ఆర్టిస్టులందరికీ రెస్పక్ట్ ఇస్తే.. ఆయన ఇంకో పది ఫంక్షన్లకు వస్తారు.. బయట ఆయనను చూడొచ్చు. మీరు ఎక్కువ డిస్ట్రబెన్స్ చేసి ఎవరు మాట్లాడిన గోల చేస్తుంటే ఆయన ఫంక్షన్లకు రావడం మానేస్తారు.. యూట్యూబ్‌లో వెతుక్కోవాలి మళ్లీ మనం’ అంటూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు హరీశ్ శంకర్ వార్నింగ్ ఇచ్చారు.

    ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ ‌తో పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుందన్నారు హరీశ్ శంకర్, ఆ సినిమా ఫ్యాన్స్ అంతా ఊహించే రీతిలోనే ఉంటుందన్నారు. సినిమా సాంగ్స్, పాటలు, సీన్లు డైలాగులు పది కాలాలా పాటు గుర్తుపెట్టుకునేలా ఉంటాయన్నారు. నాని సినిమా ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడటం సరికాదన్నారు హరీశ్ శంకర్. హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న భవదీయుడు భగత్‌సింగ్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Ante sundaraniki, Director harish shankar, Harish Shankar, Pawan kalyan

    తదుపరి వార్తలు