Director Harish Shankar: గతేడాది దిశా ఘటన ఎంత సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దోషులను పది రోజుల్లోపే ఎన్కౌంటర్ చేసారు పోలీసులు. ఆ ఘటనకు ముందు చాలా జరిగాయి..
గతేడాది దిశా ఘటన ఎంత సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దోషులను పది రోజుల్లోపే ఎన్కౌంటర్ చేసారు పోలీసులు. ఆ ఘటనకు ముందు చాలా జరిగాయి.. తర్వాత కాస్తైనా మార్పు వస్తుందేమో అనుకున్నారు కానీ అలాంటిదేం లేదని మరోసారి కొత్తగూడెం ఘటనతో రుజువైంది. కొన్ని రోజుల కింద కొత్తగూడెంలో దేవిక అనే 17 ఏళ్ల అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఆపై శవాన్ని రైల్వే ట్రాక్ దగ్గర పడేశారు. ఈ ఘటనపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు జస్టిస్ ఫర్ దేవిక అనే హ్యాష్ ట్యాగ్‌తో రైజ్ యువర్ వాయిస్ అంటూ దర్శకుడు హరీష్ శంకర్, హీరో విజయ్ దేవరకొండ, హీరో నితిన్‌లకు ట్వీట్ చేశారు.
దీనిపై హరీష్ శంకర్ ట్విట్టర్లో స్పందించాడు. 'ఎన్కౌంటర్ చేసినా బుద్ధి రావడం లేదు. అంటే ఇంకా పెద్ద పనిష్మెంట్ ఏదైనా ఆలోచించాలేమో' అంటూ ట్వీట్ చేసాడు. నిజమే చావు కంటే పెద్ద శిక్ష ఇంకేం ఉంటుంది.. ఇలా కూడా మారకపోతే ఇంకేం శిక్ష వేయాలి అంటున్నాడు ఈ దర్శకుడు. మరి ఈ విషయంపై విజయ్ దేవరకొండ, నితిన్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి. వాళ్లతో పాటు మరికొందరు కూడా ఈ ఘటనపై స్పందించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఎందుకంటే కరోనా ధ్యాసలో పడి దేవిక ఘటన అంత హైలైట్ కావడం లేదనేది కొందరి వాదన.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.