Pawan kalyan- Harish Shankar: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో హరీష్ శంకర్ రెండోసారి చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. గతేడాదే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన.. అప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని వారంతా ఎదురుచూస్తున్నారు. కరోనా రాకుండా.. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయ్యి ఉండేది. మరోవైపు ప్రస్తుతం ఇటు క్రిష్ మూవీ.. అటు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌లో నటిస్తోన్న పవన్ కల్యాణ్.. ఈ రెండు పూర్తైన తరువాత హరీష్ శంకర్‌తో సెట్స్ మీదకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ మూవీ కథ గురించి చాలా రూమర్లే వచ్చాయి. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండబోతుందని మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ తరువాత గబ్బర్ సింగ్ లాగానే ఉండబోతుందని.. ఇందులో పవన్ పోలీస్‌గా కనిపించనున్నాడని టాక్ నడిచింది. కానీ ఆ మధ్య విడుదల చేసిన ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌లో బైక్, దాని మీద బుక్, నేతాజీ, పటేల్ ఫొటోలు కనిపించాయి. దీంతో ఈ మూవీ సామాజిక కథాంశంతో తెరకెక్కుతున్నట్లు అభిమానులకు అర్థమైంది.
Random thoughts ??? pic.twitter.com/tSgvKs4DoU
— Harish Shankar .S (@harish2you) February 7, 2021
అయితే సామాజిక కథాంశమే అయినప్పటికీ.. ఈ మూవీలో మంచి లవ్ స్టోరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య మంచి ప్రేమ సన్నివేశాలు ఉంటాయి. ఇక ఇప్పుడు పవన్ మూవీ కోసం కూడా హరీష్ అలాంటి కొన్ని సీన్లను రాసుకున్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా హరీష్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. పవన్ ఖుషీ మూవీ పాటలోని ఓ సీన్‌ని అభిమానులతో షేర్ చేసుకున్నారు హరీష్. దీంతో ఖుషీ లాంటి మ్యాజిక్ ఈ మూవీలో ఉండబోతుందేమోనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం వారికి పండగే. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harish Shankar, Pawan kalyan