Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: November 17, 2019, 9:05 PM IST
హరీష్ శంకర్: జగిత్యాల (మిరపకాయ్, గబ్బర్ సింగ్, డిజే)
పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఈయన మళ్లీ సినిమాలు చేస్తాడనే వార్తలు బయట బాగానే వినిపిస్తున్నా కూడా పవన్ మాత్రం ఏం చెప్పడం లేదు. అసలు తాను సినిమా చేస్తానని ప్రకటించలేదు కూడా. అయితే ఈయన పింక్ రీమేక్‌లో నటించబోతున్నాడని.. దానికి దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలంటూ సాక్షాత్తు బాలీవుడ్ టాప్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసాడు. బోనీ కపూర్ కూడా ఈ సినిమాపై ఓపెన్ అయ్యాడు. అయితే ఈ చిత్రానికి దర్శకుడిగా వేణు శ్రీరామ్ కంటే ముందు హరీష్ శంకర్‌ను అడిగారని తెలుస్తుంది. అయితే ఈయన మాత్రం పవన్ సినిమా అయినా సరే.. తాను చేయనని మొహం మీదే చెప్పేసాడని వార్తలు వినిపిస్తున్నాయి.

హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్
దానికి కారణాలు కూడా లేకపోలేవు.. పవన్ లాంటి హీరో సినిమాకు ఆఫర్ వచ్చినా కూడా కాదనడానికి కారణం అది రీమేక్ కావడమే. ఇప్పటికే కెరీర్లో ఎక్కువగా రీమేక్ సినిమాలే చేసాడు హరీష్. మిరపకాయ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి సొంత కథలు హిట్ అయినా కూడా గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ లాంటి రీమేక్ సినిమాలు విజయం సాధించడంతో హరీష్‌పై ఆ ముద్ర పడిపోయింది. దాంతో అది చెరిపేసుకుని సొంత టాలెంట్ నిరూపించుకోవాలని పవన్ సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తుంది. హరీష్ నో చెప్పిన తర్వాతే వేణు శ్రీరామ్‌ను దర్శకుడిగా ఎంచుకున్నారని ప్రచారం జరుగుతుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
November 17, 2019, 9:05 PM IST