DIRECTOR HARISH SHANKAR ON HIS BIRTHDAY CONTRIBUTED GROCERIES FOR ORPHANAGE TA
పుట్టినరోజున పెద్ద మనసును చాటుకున్న దర్శకుడు హరీష్ శంకర్..
హరీష్ శంకర్: మాస్ డైరెక్టర్‌గా రచ్చ చేస్తున్న హరీష్ శంకర్.. ఇప్పుడు రైటర్‌గా సునీల్ కోసం మారిపోయాడు. వేదాంతం రాఘవయ్య అనే సినిమాకు కథ అందిస్తున్నాడు హరీష్ శంకర్.
కరోనా వైరస్ బాధితులు ఒక్కోక్కరు ఒక్కోరకంగా తమ వంతు సాయం అందిస్తున్నారు. తాజాగా హరీష్ శంకర్ తన పుట్టినరోజు సందర్భంగా అనాథలకు తన వంతు సాయం చేయనున్నట్టు ప్రకటించారు.
కరోనా వైరస్ బాధితులు ఒక్కోక్కరు ఒక్కోరకంగా తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా పని లేకుండా పోయిన పేద సినీ కార్మికుల సంక్షేమం కోసం కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసారు. మరి కొంత మంది హీరోలు తమ వంతుగా ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్స్‌కు చేతనైనా సాయం చేస్తున్నారు. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్.. తన పుట్టినరోజు సందర్భంగా అనాథలైన 45 మంది అనాథ పిల్లలకు రెండు నెలలకు సంబంధించిన నిత్యావసరాలు అందిస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ హెల్పింగ్ హ్యాండ్స్ హుమానిటీ పేరిట ఈ సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. హరీష్ శంకర్ విషయానికొస్తే.. గతేడాది వరుణ్ తేజ్‌తో ‘వాల్మీకీ’ సినిమా తెరకెక్కించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈయన పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.