‘వాల్మీకి’ టైటిల్ మార్పుపై హరీష్ శంకర్ డబుల్ గేమ్..

వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్మీకి’ టైటిల్ పై ముందు నుంచి బోయ సంఘాలు గోల చేస్తూనే ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ మార్పు విషయమై హరీష్ శంకర్ బోయ సంఘాలతో డబుల్ గేమ్ ఆడినట్టు ఉందని నెటిజన్స్ చెప్పుకుంటున్నారు.

news18-telugu
Updated: September 20, 2019, 3:11 PM IST
‘వాల్మీకి’ టైటిల్ మార్పుపై హరీష్ శంకర్ డబుల్ గేమ్..
హరీష్, వరుణ్ Twitter/harish2you
  • Share this:
వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్మీకి’ టైటిల్ పై ముందు నుంచి బోయ సంఘాలు గోల చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఏమైతేనేం చివరు బోయ సంఘాలు అనుకున్నది సాధించారు.. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సినిమా టైటిల్‌ను ‘వాల్మీకి’ టైటిల్ నుంచి ‘గద్దలకొండ గణేష్’గా మారింది. ఈ రకంగా చివరి నిమిషయంలో తెలుగులో పూర్తిగా సంబంధంలేని టైటిల్‌ మార్చుకున్న సినిమా ఏది లేదు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు దర్శకుడు హరీష్ శంకర్ ఈ టైటిల్ విషయమై చాలా పట్టుదలతో ఉన్నాడు. కానీ హైకోర్టు బోయ సంఘాలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో చిత్ర యూనిట్‌కు పెద్ద షాక్ అనే చెప్పాలి. మరోవైపు ఈ సినిమా టైటిల్ మార్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తానమని ఈ సంఘాల వాళ్లు చెప్పారు. మరోవైపు సీడెడ్ (రాయలసీమ)లో వాల్మీకి బోయలు జనాభా ఎక్కువ. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కోరిక మేరకు ‘వాల్మీకి’ టైటిల్‌ను కాస్తా గద్దలకొండ గణేష్‌గా మార్చారు.

varun tejs vamiki movie review gaddalakonda ganesh movie review,valmiki movie review,varun tej valmiki movie review,varun tej gaddalakonda ganesh movie review,varun tej,gaddalakonda ganesh movie review,gaddalakonda ganesh review,gaddalakonda ganesh,valmiki movie review,gaddalakonda ganesh public talk,gaddalakonda ganesh movie public talk,gaddalakonda ganesh movie,valmiki review,valmiki movie public talk,valmiki public review,gaddalakonda ganesh trailer,gaddalakonda ganesh (valmiki) movie review,valmiki movie,vaun tej valmiki movie review,valmiki movie public review,valmiki movie talk,valmiki public talk,varun tejs vamiki movie review gaddalakonda ganesh public tak,varun tejs vamiki movie review gaddalakonda ganesh movie review twitter review,tollywood,telugu cinema,గద్దలకొండ గణేష్ మూవీ రివ్యూ,వాల్మీకి మూవీ రివ్యూ,వరుణ్ వాల్మీకి మూవీ రివ్యూ,వరుణ్ తేజ్,వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ మూవీ రివ్యూ,హరీష్ శంకర్ వరుణ్ తేజ్ గద్దలకొండ మూవీ రివ్యూ,
‘గద్దలకొండ గణేష్‌గా వరుణ్ తేజ్ (Twitter/Photo)


ఇక ఈ రోజు విడుదలైన  చాలా థియేటర్స్‌లో ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్‌తో పాటు టైటిల్ అన్ని ‘వాల్మీకి’ పేరుతోనే ప్రదర్శితమయ్యాయి.  అంటే రాత్రికి రాత్రి తీసుకున్న డెసిషన్ కాబట్టి ఈ మార్పులు చేయడం కుదరలేదని సినిమా నిర్మాతలు చెప్పొచ్చు. హైకోర్టు తీర్పుతో రాత్రికి రాత్రి వాల్మీకి పోస్టర్లు కాస్తా ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు. ఏదైనా ఒక సినిమాలో ఒక సన్నివేశాన్ని యాడ్ చేయాలన్న పేరు మార్చాలన్న సెన్సార్ అనుమతి తప్పనిసరి. మరి తాజాగా గద్దలకొండ గణేష్‌గా మారిన వాల్మీకి సినిమాకు ఈ అనుమతులు తీసుకున్నారా అనేది చూడాలి. కేవలం రాయలసీమలో మాత్రం ఈ సినిమాను గద్దలకొండ గణేష్‌గా టైటిల్ మార్చిన ప్రింట్స్‌ను ప్రదర్శితం చేసారని టాక్. హైదరాబాద్ సహా మిగతా తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ అన్ని చోట్ల ‘వాల్మీకి’ టైటిల్‌తోనే ఈ సినిమా ప్రదర్శితమైంది. కేవలం రాయలసీమ ప్రాంతంలో ఉన్న వాల్మీకి బోయలను సంతృప్తి పరచడానికి నిర్మాతలతో కలిసి హరీష్ శంకర్ ఈ సినిమా టైటిల్ మార్చినట్టు ఏదో మమ అనిపించినట్టు ఉందని అందరు చెప్పుకుంటున్నారు. ఈ రకంగా హరీష్ శంకర్ ‘వాల్మీకి’ అదేనండి గద్దలకొండ గణేష్ సినిమా టైటిల్ విషయమై బోయ సంఘాలతో  డబుల్ గేమ్ ఆడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై హరీష్ శంకర్ ఏమంటాడో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 20, 2019, 3:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading