Pawan Kalyan: పవన్ పాత్ర గురించి క్రేజి లీక్ చేసిన డైరెక్టర్.. ఏ విషయం అంటే?

harish shankar, pawan kalyan

Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తో బాగా బిజీ గా మారాడు. ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ మరిన్ని క్రేజీ సినిమాలతో అభిమానుల ముందుకు వస్తున్నాడు.

  • Share this:
    Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తో బాగా బిజీ గా మారాడు. ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ మరిన్ని క్రేజీ సినిమాలతో అభిమానుల ముందుకు వస్తున్నాడు. చాలా రోజుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో అడుగు పెట్టి తన ఖాతాను నింపుకుంటున్నాడు.

    వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ ఎంతటి విజయాన్ని అందించిందో చూశాం. ఇక ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాకుండా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మరో రీమేక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు వరుసలో ఉండగానే మరో డైరెక్టర్ తో సినిమా ఉందని తెలిపారు.

    గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ సినిమా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. హరీష్ శంకర్ పవన్ కు కథ కూడా వినిపించడంతో పవన్ ఓకే అన్నాడట. అయితే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని, ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని సమాచారం. పైగా ఈ సినిమాకి 'సంచారి' అనే పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు.



    ఇక ఈ సినిమా మైత్రి మూవీస్ కాంబినేషన్ తో రాబోతుంది. ఈ సినిమాలో వినోదం మాత్రమే కాదంటూ మొదటి నుండి కాన్సెప్ట్ అంచనాలతో ప్రారంభమవుతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా హరీష్ శంకర్ తన ట్విట్టర్ వేదికగా వీడియో షేర్ చేయగా అందులో బద్రి సినిమాలో పవన్ సీన్ ను షేర్ చేశాడు. పైగా ఇందులో పవన్ ఎనర్జీ, యాక్టింగ్ లెవెల్స్ ను మళ్లీ రిపీట్ చేసేలా కనిపిస్తుంది. మొత్తానికి మళ్లీ చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ట్వీట్ కూడా చేశాడు హరీష్ శంకర్. మొత్తానికి పవన్ పాత్ర బద్రి సినిమాలో ఉన్న పాత్రలా ఉంటుందని లీక్ చేసాడు హరీష్ శంకర్. దీంతో పవన్ అభిమానులకు పండగనే చెప్పవచ్చు. అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ ఎగ్జైట్ అవుతున్నట్లు స్పందించాడు.
    Published by:Navya Reddy
    First published: