ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోపై హరీష్ శంకర్ ఆసక్తికర కామెంట్స్..

హోలీ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన లభించింది. తాజాాగా ఎన్టీఆర్ ఫ్యామీలీ ఫోటోపై ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు.

news18-telugu
Updated: March 10, 2020, 6:22 PM IST
ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోపై హరీష్ శంకర్ ఆసక్తికర కామెంట్స్..
ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. (Twitter/Photo)
  • Share this:
హోలీ పండగను పురస్కరించుకొని.. అభిమానులకు ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కుటుంబ సభ్యులైన భార్య లక్ష్మి ప్రణతి, ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి హోలీ ఆడుతున్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. ఈ ఫోటోను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన లభించింది. తాజాాగా ఎన్టీఆర్ ఫ్యామీలీ ఫోటోపై ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. అందులో ఎన్టీఆర్ చిన్నబ్బాయి భార్గవ్ రామ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఎన్టీఆర్ చిన్నబ్బాయి.. కెమెరా వైపు చూసిన విధానం చూస్తుంటే.. వదిలితే.. ఇపుడు దూకేసేలా ఉన్నాడు. లిటిల్ టైగర్ వస్తున్నాడు అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేసాడు.

director harish shankar comments on jr ntr family photo,jr ntr,jr ntr family photo,jr ntr rrr,rrr jr ntr rajamouli ram charan,jr ntr with pranathi,jr ntr bhargav ram abhay ram,jr ntr instagram,jr ntr twitter.jr ntr with family,jr ntr harish shankar,harish shankar tweet on jr ntr family photo,harish shankar twitter,harish shankar,tollywood,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటో,భార్య ప్రణతి కొడుకులు అభయ్ రామ్ భార్గవ్ రామ్,జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటో పై హరీష్ శంకర్ కామెంట్స్,హరీష్ శంకర్ ఎన్టీఆర్ ఫ్యామలీ ఫోటో,ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటో పై హరీష్ శంకర్ కామెంట్స్
భార్య పిల్లలతో జూనియర్ ఎన్టీఆర్ (Twitter/Photo)


ఇక ఎన్టీఆర్ చిన్న కొడుకు అచ్చం తన ముత్తాత ఎన్టీఆర్‌లా కనిపిస్తున్నాడని సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

హరీష్ శంకర్ గతంలో ఎన్టీఆర్ హీరోగా ‘రామయ్య వస్తావయ్యా’ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్‌తో నెక్ట్స్ మూవీ  చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ను లైన్‌లో పెట్టాడు. అటు కొరటాల శివ, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, అట్లీ వంటి దర్శకులను లైన్‌లో పెట్టాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 10, 2020, 6:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading