తెరపై కొత్త పవన్ కళ్యాణ్‌ను చూస్తారు.. కథపై దర్శకుడు హరీష్ శంకర్ క్లారిటీ..

హరీష్ శంకర్: జగిత్యాల (మిరపకాయ్, గబ్బర్ సింగ్, డిజే)

త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు పూర్తిగా పక్కన పెట్టి పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించాడు.

 • Share this:
  త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు పూర్తిగా పక్కన పెట్టి పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించాడు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలకు మరో నాలుగేళ్లు ఉండటం.. ఇక తాను స్థాపించిన జనసేన పార్టీని బతికించుకోవడానికి జనసేనాని మళ్లీ ముఖానికి రంగేసిని రంగంలోకి దిగబోతున్నాడు. ఇప్పటికే  హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘లాయర్ సాబ్’ టైటిల్‌తో పరిశీలనలో ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.  ఈ సినిమా కోసం దిల్ రాజు.. పవన్ కళ్యాణ్.. ప్రత్యేక విమానాన్ని అరేంజ్ చేసినట్టు సమాచారం. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక చారిత్రక నేపథ్యమున్న సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు హరీష్ శంకర్ సినిమాకు ఓకే చెప్పాడు. వీటితో పాటు త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్‌ల సినిమాలను కూడా లైన్లో పెట్టినట్టు సమాచారం.

  director harish shankar clarity about pawan kalyan,Pawan Kalyan Harish Shankar,Pawan Kalyan Harish Shankar movie,Pawan Kalyan Harish Shankar mythri movie makers,Pawan Kalyan Harish Shankar movie confirmed,Pawan Kalyan Harish Shankar gabbar singh,Pawan Kalyan krish movie,Pawan Kalyan pink remake,telugu cinema,pspk 28 harish shankar,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్,పవన్ కళ్యాణ్ క్రిష్,పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ మైత్రి మూవీ మేకర్స్
  పవన్ కళ్యాణ్,హరీష్ శంకర్ (Twitter/Photo)


  ఇక పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ సినిమా అనగానే అందరికీ గబ్బర్ సింగ్ సినిమానే గుర్తుకు వస్తోంది. హిందీలో హిట్టైన ‘దబాంగ్’ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు హరీస్ శంకర్ ఈ చిత్రాన్ని మలిచిన తీరు ఇప్పటికీ పవన్ అభిమానులు మరిచిపోలేదు.తాజాగా వీళ్లిద్దరి కలయికలో వస్తోన్న ఈ చిత్రం రీమేక్ అని చెబుతున్నారు. దీనిపై హరీష్ శంకర్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఈ సినిమా రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. అది నిజంకాదు.. పవన్ కళ్యాణ్ కోసం ఎపుడో ఈ స్క్రిప్ట్‌ను రెడీ చేసి పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చాడు. సరికొత్త కథతోనే పవన్ కళ్యాణ్‌‌ను తెరపై చూపిస్తానని మాట ఇచ్చాడు. మొత్తానకిి హరీష్ శంకర్ తన మాటను నిలబెట్టుకుంటాడా లేదా అనేది చూడాలి.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: