పోలీసులను హీరోలుగా చూపించి తప్పు చేసానంటున్న దర్శకుడు..

Director Hari: తమిళనాట ప్రస్తుతం పోలీసులపై విమర్శలు ఓ రేంజ్‌లో వస్తున్నాయి. అక్కడ తండ్రీ కొడుకుల లాకప్ డెత్‌పై అంతా మండి పడుతున్నారు. అన్యాయంగా తండ్రీకొడుకులను చంపేసారంటూ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 29, 2020, 9:32 PM IST
పోలీసులను హీరోలుగా చూపించి తప్పు చేసానంటున్న దర్శకుడు..
సింగం దర్శకుడు హరి (singam hari)
  • Share this:
తమిళనాట ప్రస్తుతం పోలీసులపై విమర్శలు ఓ రేంజ్‌లో వస్తున్నాయి. అక్కడ తండ్రీ కొడుకుల లాకప్ డెత్‌పై అంతా మండి పడుతున్నారు. అన్యాయంగా తండ్రీకొడుకులను చంపేసారంటూ సెలబ్రిటీస్‌తో పాటు అందరూ ఫైర్ అవుతున్నారు. ఈ విషయంపై ఇప్పుడు దర్శకుడు హరి సంచలన వ్యాఖ్యలు చేసింది. సింగం సిరీస్‌తో పోలీసులను హీరోలు చేసి.. వాళ్లు విధి నిర్వహణలో ఉన్నపుడు ప్రాణాలను సైతం లెక్క చేయరని చూపించిన దర్శకుడు హరి ఇప్పుడు తనపై తనే మండి పడుతున్నాడు. పోలీసులను హీరోలుగా చూపించి చాలా పెద్ద తప్పు చేసానని.. అనవసరంగా అలాంటి సినిమాలు తీసానని ఇప్పుడు ఫీల్ అవుతున్నట్లు చెప్పాడు ఈ దర్శకుడు.
సింగం దర్శకుడు హరి (singam hari)
సింగం దర్శకుడు హరి (singam hari)


జయరాజ్, బెన్నిక్స్ మరణాలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన హరి.. ఇలాంటి సంఘటనలు మళ్లీ తమిళనాడులో జరగకూడదని కోరాడు. అంతలోపే మరో ఆటోడ్రైవర్ ప్రాణాలు కూడా పోలీసుల చేతుల్లోనే పోవడం సంచలనం రేపుతుంది. దాంతో కొందరు అధికారుల కారణంగా మొత్తం పోలీసు శాఖ ప్రతిష్ఠ దెబ్బతింటోందని హరి తెలిపాడు. పోలీసులను ప్రశంసిస్తూ ఐదు సినిమాలు చేసినందుకు చింతిస్తున్నానని హరి ఓ ప్రకటన కూడా విడుదల చేసాడు.
సింగం దర్శకుడు హరి (singam hari)
సింగం దర్శకుడు హరి (singam hari)

ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లఘించారంటూ పి జయరాజ్, ఆయన కుమారుడు బెన్నిక్స్‌లను పోలీసులు అరెస్టు చేయగా.. రెండు రోజుల అనంతరం పోలీస్ కస్టడీలో అనుమానాస్పద పరిస్థితుల్లో వీళ్లు మరణించడం సంచలనం రేపింది. గుండెపోటుతో మరణించారని పోలీసులు ప్రకటించగా.. తీవ్రంగా హింసించి చంపేశారంటూ నిరసనలు మిన్నంటాయి.
First published: June 29, 2020, 9:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading