Home /News /movies /

DIRECTOR GEETHA KRISHNA SENSATIONAL COMMENTS ON CASTING COUCH SLB

హీరోయిన్లంటే పడుకోవాల్సిందే! రేణూ దేశాయ్ టాపిక్ తీస్తూ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Photo Twitter

Photo Twitter

తాజాగా దర్శకుడు గీతా కృష్ణ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చి హీరోయిన్స్, క్యాస్టింగ్ కౌచ్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేణూ దేశాయ్ టాపిక్ తీస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ అయ్యాయి.

టెక్నాలజీ పెరగడం, వందల కొద్ది యూ ట్యూబ్ ఛానెల్స్ అందుబాటులోకి రావడంతో చిన్నా పెద్దా అనే తేడాలేకుండా ఎందరో దర్శకనిర్మాతలు, నటీనటులు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆడియన్స్‌తో టచ్‌లో ఉండేందుకు ఇది వారికి వరంలా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగులో రెండు మూడు సినిమాలు చేసిన దర్శకుడు గీతా కృష్ణ (Geetha Krishna) యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చి హీరోయిన్స్, క్యాస్టింగ్ కౌచ్‌ (Casting Couch)పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అవకాశాల పేరుతో మహిళలను లైంగికంగా దోచుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలే నడిచాయి. అయితే ఇదే క్యాస్టింగ్ కౌచ్‌పై గీతా కృష్ణ స్పందించిన తీరు జనాల్లో చర్చనీయాంశంగా మారింది. అప్పుడు.. ఇప్పుడు అని కాదు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ అనేది ఎప్పుడూ ఉందని, అమ్మాయిలకు ఇండస్ట్రీ సేఫ్‌ ప్లేస్‌ కాదని ఆయన చెప్పడం హాట్ టాపిక్ అయింది.

నాగార్జున హీరోగా రూపొందిన సంకీర్తన అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన గీతా కృష్ణ.. ఆ తర్వాత కీచురాళ్లు, కోకిల వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే అవేవీ పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో తమిళ సినీ పరిశ్రమకు వెళ్లి అక్కడ రెండు సినిమాలు రూపొందించారు. ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ వారు ఆయనను ఇంటర్వ్యూ చేయగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌‌పై ఓపెన్ అవుతూ చాలా విషయాలు ప్రస్తావించారు.

మీరు సినిమాలు తీసినప్పటి నుంచి ఇప్పటివరకు సినీ పరిశ్రమలో ఏవైనా మార్పులు కనిపించాయా? అని యాంకర్ అడగడంతో.. హీరోయిన్ల మ్యాటర్ తీస్తూ అప్పుడైనా పడుకోవాల్సిందే ఇప్పుడైనా పడుకోవాల్సిందే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది ఇండస్ట్రీలో పాతుకుపోయింది అన్నారు. రేణు దేశాయ్‌కి కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పలేదంటూ గీతా కృష్ణ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. సింగర్స్ విషయంలోనూ ఇది జరుగుతుందని, ఇలాంటి విషయాలు బయటపెడితే ఆఫర్లు ఇవ్వరని ఆయన చెప్పారు.

ఇకపోతే క్యాస్టింగ్ కౌచ్‌ ఒక్కటే కాదని, ఇండస్ట్రీలో హనీ ట్రాప్ కూడా ఉందని గీతా కృష్ణ అన్నారు. తమకు మంచి ఆఫర్లు వస్తాయని తమకు తామే సమర్పించుకుంటారని, దానికి అర్థమే హనీట్రాప్ అని అన్నారు. గత కొన్నేళ్లుగా క్యాస్టింగ్ కౌచ్ అంశంపై ఓ రేంజ్‌లో చర్చలు నడుస్తున్నాయి. శ్రీ రెడ్డి లాంటి తారలు దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. చాలామంది నటీమణులు తమపై జరిగిన లైంగిక దాడిని బయటపెట్టారు. ఈ పరిస్థితుల నడుమ గీతా కృష్ణ చేసిన కామెంట్స్ పలు చర్చలకు తావిచ్చాయి.
Published by:Sunil Boddula
First published:

Tags: Casting Couch, Renu Desai, Tollywood Casting Couch

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు