త్రివిక్రమ్‌‌లో ఈ పైత్యం కూడా ఉందా.. అవాక్కవుతున్న అభిమానులు..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌లో ఈ పైత్యం కూడా ఉందా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మనకున్న అత్యుత్తమ దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. తాజాగా త్రివిక్రమ్..

news18-telugu
Updated: March 24, 2020, 6:17 PM IST
త్రివిక్రమ్‌‌లో ఈ పైత్యం కూడా ఉందా.. అవాక్కవుతున్న అభిమానులు..
త్రివిక్రమ్ Photo : Twitter
  • Share this:
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌లో ఈ పైత్యం కూడా ఉందా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మనకున్న అత్యుత్తమ దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. మాటల మాంత్రికునిగా తెలుగు తెరపై ఆయన చూపించిన మాటల మాయాజాలం ఎంత చెప్పినా తక్కువే. ఇక  త్రివిక్రమ్ క‌లం నుంచి ఏదైనా ప‌దం జాలు వారితే అది మ‌న‌కు ఊత‌ప‌దం అవుతుంది.. ఆయ‌న మ‌న‌సుపెట్టి మాట రాస్తే అది మ‌న‌కు మ‌రిచిపోలేనంత‌గా గుర్తుండిపోతుంది. త‌న మాట‌ల‌తో మాయ చేయ‌డం.. ఎంత పెద్ద సీన్ అయినా కేవ‌లం మాట‌ల‌తో క‌న్విన్స్ చేయ‌డం అనేది చిన్న విష‌యం కాదు.. కానీ అది ఆయ‌న‌కు మాత్రం వెన్నతో  కాదు పెన్నుతో పెట్టిన విద్య‌.దటీజ్ త్రివిక్రమ్. తెలుగు ఇండస్ట్రీలో కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అనే కార్డు వేసుకునే అతికొద్ది మంది దర్శకుల్లో త్రివిక్రమ్ కూడా ఒకరు. తాజాగా అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని ఇపుడు  ఎన్టీఆర్‌తో నెక్ట్స్ సినిమా చేయడానిక రెడీ అవుతున్నారు. తాజాగా త్రివిక్రమ్ వెండితెరపై తన పేరును దర్శకుడిగా కాకుండా..  నిర్మాతగా చూసుకోవాలనే కోరిక ఉందట. అది కూడా ఓ పెద్ద హీరోతో బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాకు నిర్మాత అనిపించుకోవాలని ముచ్చటపడుతున్నాడట.గతంలో త్రివిక్రమ్.. పవన్, నితిన్‌తో కలిసి ‘ఛల్ మోహన్ రంగా’ అనే చిత్రాన్ని నిర్మించి ఫ్లాప్‌ను చవిచూసాడు. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)
త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)


కానీ ఎన్టీఆర్ సినిమా తర్వాత మళ్లీ త్రివిక్రమ్.. అల్లు అర్జున్‌తో నెక్ట్స్ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడట. ఈ చిత్రాన్ని కూడా ‘అల వైకుంఠపురములో’ నిర్మించిన గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్ కార్డ్స్‌లో నిర్మాతగా తన పేరు చూసుకోవాలని ఉబలాటపడుతున్నట్టు సమాచారం. దర్శకత్వంతో పాటు నిర్మాత అన్న ట్యాగ్ కనిపించాలనే పట్టుదలతో ఉన్నారట. ఇన్నాళ్లు హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌కు షాడో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. తొలిసారి నిర్మాతగా అది కూడా బన్ని వంటి స్టార్ హీరోతో చేయబోయే సినిమాకు నిర్మాతగా తెరపై తన పేరు చూసుకోవడంతో పాటు హిట్ కొట్టాలనే కసి మీదున్నట్టు సమాచారం. మొత్తానికి అందరు త్రివిక్రమ్‌ హాయిగా దర్శకత్వంలో చేసుకుంటూ కాలం గడపకుండా.. నిర్మాతగా ఈ పైత్యం ఏమిటో అని అనుకుంటున్నారట.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 24, 2020, 6:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading