రాఘవ లారెన్స్ షాకింగ్ నిర్ణయం.. ఇక పై వాటి జోలికి పోను..

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడైన రాఘవ లారెన్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

news18-telugu
Updated: December 23, 2019, 9:34 AM IST
రాఘవ లారెన్స్ షాకింగ్ నిర్ణయం.. ఇక పై వాటి జోలికి పోను..
లారెన్ప్ రాఘవేంద్ర
  • Share this:
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడైన రాఘవ లారెన్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్‌లో ఇకపై బయట నిర్వహించే ఏ కార్యక్రమాలకు హాజరు కానని ఈ సందర్భంగా ప్రకటించారు. అందుకు గల కారణాలను తెలియజేసారు. హాయ్ ఫ్రెండ్స్.. మీకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఇక నుంచి బయట జరిగే ఏ కార్య్రమానికి నేను హాజరుకాబోను. రజినీకాంత్ సినిమాకు సంబంధించిన కార్యక్రమం అయితే.. ఆయన పర్మిషన్ తీసుకొని వస్తాను. ఈ నిర్ణయం వెనక ఎన్నో కారణాలున్నాయన్నాడు. అవన్నీ మీతో చెప్పలేను. నాకు రజినీకాంత్ దీవెనల కన్నా ఏది ఎక్కువ కాదున్నాడు.

రీసెంట్‌గా రాఘవ లారెన్స్  సంచలన నిర్ణయం వెనక ఇటీవలే జరిగిన ‘దర్బార్’ ఆడియోలో ఆయన కమల్ హాసన్ పై చేసిన వ్యాఖ్యలే కారణమంటున్నారు. ఈ వేడుకలో రజినీకాంత్ పై అభిమానంతో అప్పట్లో కమల్ హాసన్‌ను సంబంధించిన ఏ సినిమా విడుదలైన ఆ పోస్టర్స్‌పై పేడ కొట్టేవాడని చెప్పడం వివాదాస్సదం అయ్యాయి. నేను చిన్నప్పటి నుంచి రజినీకాంత్ అభిమానిని. ఇపుడు పరిస్థితులు మారిపోయాయి. ఇద్దరూ  ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నడస్తున్నారు. స్నేహ బంధం కన్నా గొప్పది ఏదీ కాదని ఇప్పటికీ నాకు అర్ధమైందన్నారు. ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడిన మాటలు కమల్‌ను అవమానకరంగా మాట్లారంటూ సోషల్ మీడియా వేడికగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో లారెన్స్  వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతేకాదు కమల్ హాసన్‌ను కలవడం కూడా జరిగింది. ఏమైందో ఏమో ఇపుడు ఏకంగా ఏ కార్యక్రమానికి హాజరు కానని ప్రకటించి సంచలనం సృష్టించారు.

First published: December 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు