వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరిగింది. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు బాబీ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేజ్ పైకి వచ్చి మాట్లాడిన బాబీ... చిరంజీవి గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవికి ఉండే మంచితనం వల్ల ఆయన రాజకీయాలు చేయలేకపోయారన్నారు బాబీ. రాజకీయాలు చిరుకు సూట్ కావన్నారు. పాలిటిక్స్ చేయడానికి పవన్ కళ్యాన్ ఉన్నారన్నారు. ఆవేశం మంచితనం కలిపితే పవన్ కళ్యాన్ అన్నారు. రాజకీయాల్లో పవన్ అయితే రాణిస్తారన్నారు. పవర్ స్టార్ నిలదీస్తున్నాడన్నారు. నిలదీస్తాడు అని కూడా చెప్పారు.
చిరంజీవి రాజకీయాల నుంచి బయటకు వచ్చి మంచి పనిచేశారన్నారు. ఆయన పాలిటిక్స్‌లోకి వెళ్లడంతో నేను భయపడ్డానన్నారు. ఇక చిరంజీవితో సినిమా చేయలేకపోయానేమో అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఇన్నాళ్లకు తనకు మెగాస్టార్‌తో సినిమా చేసే అవకాశం వచ్చిందన్నారు. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే మాటలు చాలవని చెప్పిన బాబీ ఆయనను డైరెక్ట్ చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాని అన్నాడు. ఓ అభిమానిగా చిరును ఆరాధించే తాను ఆయనతో సినిమా చేయడం తన అదృష్టమన్నాడు. ఇక తన తండ్రి చనిపోయిన మూడో రోజునే షూటింగ్ చేశానని, అది కూడా తన నాన్న గారు చెప్పడం వలనే చేసినట్లు చెప్పాడు. తన తండ్రి కూడా చిరంజీవిగారికి పెద్ద అభిమాని అంటూ చెప్పుకొచ్చారు.
ఊరికే ఎవరూ మెగాస్టార్ అయిపోరన్నారు. ఆయనలో ఎంతో మంచితనం ఉందన్నారు. మెగాస్టార్ కు కోపం ఎందుకు రాదు.. ఎవరెవరో మాట అనేస్తే తిరిగి మాట ఎందుకు అనరు అంటే ఒక రోజు అయన ఒక మాట చెప్పారు. అవతలోడు అన్నాడు అని మనం అనేస్తే వాడికి తల్లిదండ్రులు ఉంటారు, భార్యాబిడ్డలు ఉంటారు, చెల్లెలు ఉంటారు.. వాళ్ళు బాధపడతారు బాబీ అన్నాడు.. ఎలా వచ్చిందో తెలియదు మీకు ఈ గుణం.. నిజంగా మీకు రాజకీయాలకు వెళ్ళినప్పుడు మళ్లీ మీతో చేయలేనేమో అనుకున్నాను.. కానీ ఎక్కడో ఒక ఫీలింగ్ ఉండేదన్నారు.
బాబీ మాట్లాడుతూ.. ‘మీకు రాజకీయాలు వన్ పర్సెంట్ కూడా కరెక్ట్ కాదు అన్నయ్య. మీకు దేవుడు ఒక తమ్ముడిని ఇచ్చాడు.. అతను చూసుకుంటాడు.. అతను సమాధానం చెప్తాడు. అతడు గట్టిగా నిలబడతాడు. మీలో నుంచి వచ్చిన ఆవేశం, మంచితనం కలగలిపితే పవర్ స్టార్. అతను మాటకు మాట సమాధానమిస్తాడు. పవన్ తో నేను కలిసి పనిచేశాను.సేమ్ మంచితనం” అని చెప్పుకొచ్చాడు. ఇక సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి గురించి చెప్పుకొస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bobby, Chiranjeevi, Pawan kalyan, Waltair Veerayya